/rtv/media/media_files/2025/03/07/Rs4PwgD8oi9sUKG2pErz.jpg)
Space x Rocket Star Ship
ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ నిన్న ఉదయం భూకక్ష్యలో ప్రవేశించే సమయంలో ముక్కలైంది. ప్రయోగించిన కొద్దిసేపటిలోనే రాకెట్ పేలిపోయింది. ఆ తరువాత కూలిపోయి...పెద్ద శబ్దం చేస్తూ శకలాలు భూమి మీదకు పడిపోయింది. ఆ సమయంలో నిప్పుల వర్షమే కురిసిందని చెబుతున్నారు చూసినవాళ్ళు. స్పేస్ ఎక్స్ కేంద్రం నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ కంట్రోల్ తప్పి నిమిషాల వ్యవధిలోనే పేలి పోయింది. ఇంజిన్ ఆగి పోవడంతో సౌత్ ఫ్లోరిడా బహమాస్ ప్రాంతాల్లో తునాతునకలై కూలిపోయింది. ఫ్లోరిడాలోని మయామి, ఫోర్ట్ లాడెరల్, పాల్మ్ బీచ్, ఓర్లాండో ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో శకలాలు పడ్డాయి. లాంచ్ చేసిన కొన్ని నిమిషాలకే ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ షిప్ కంట్రోల్ కోల్పోయిందని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. స్పేస్ షిప్ విఫలం కావడంలో జరిగిన లోపాన్ని విశ్లేషింకుచుంటామని సైంటిస్టులు తెలిపారు.
Just saw Starship 8 blow up in the Bahamas @SpaceX @elonmusk pic.twitter.com/rTMJu23oVx
— Jonathon Norcross (@NorcrossUSA) March 6, 2025
విమానాల రాకపోకలు..
రాకెట్ శకలాలు కింద పడడం వలన నిన్నంతా అమెరికాలో పలు ప్రాంతాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ ఎఫెక్ట్ ఈరోజు కూడా పడింది. శకలాలు ఫ్లోరిడాలోని మయామి, ఫోర్ట్ లాడెరల్, పాల్మ్ బీచ్, ఓర్లాండో ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో పడ్డాయి. ఇన్సిడెంట్ ఉదయమే జరిగినా...రాత్రి వరకు శకలాలు పడతాయేమోనని ఎయిర్ పోర్ట్ లలో గ్రౌండ్ క్లియరెన్స్ చేయించారు వైమానిక అధికారులు. దీంతో దేశ వ్యాప్తంగా 240 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఎయిర్ పోర్ట్ లలో నుంచి వెళ్ళాల్సి, రావాల్సిన విమానాలు అన్నీ ఆలస్యంగా నడిచాయి. నిన్న అంతా లేట్ గా జరగడం వలన ఇవాళ కొన్ని విమానాలు లేట్ గా నడిచాయని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.