/rtv/media/media_files/2025/01/22/2XlFiNptesgl4xZuND0K.jpg)
Donald Trump
Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అధికారంలోకి రాగానే వలసదారులను కట్టడి చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే జన్మతః పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తూ సంతకం చేశారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో డెమోక్రట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వారి న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి. ఈ 22 రాష్ట్రాలు వేరు వేరు వ్యాజ్యలు దాఖలు చేశాయి.
Also Read: పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్.. అలా చేయకుంటే.. ?
జన్మతః పౌరసత్వం రద్దు..
అధ్యక్షుడు ట్రంప్ జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి రాకుండా వెంటనే ఆపేయాలని తమ వ్యాజ్యంలో న్యాయస్థానాన్ని కోరారు. మరి దీనిపై కోర్టులు ఎలాంటి తీర్పులిస్తాయనేది ఆసక్తిగా మారింది. అయితే అమెరికాలో సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్నవారు 1.40 కోట్ల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీళ్లలో భారతీయుల సంఖ్య 7.25 లక్షలుగా ఉంది.
Also Read : సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
మెక్సికో, సాల్వెడార్ దేశ ప్రజల తర్వాత అత్యధికంగా ఉంది భారతీయులే. ఎన్నికల ముందు నుంచే అక్రమ వలసదారుల అంశంపై ట్రంప్ తన వైఖరినీ చెప్పేశారు. బాధ్యతలు చేపట్టాక చివరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే.. అమెరికాకి వలసవెళ్లేవారికి అక్కడ పిల్లలు పుడితే వారికి ఇక అమెరికా పౌరసత్వం లభించదు. వలసవచ్చేవారైనా, అక్రమంగా ఉంటున్నవారైనా అమెరికాలో పిల్లలు జన్మినిస్తే.. ఆ పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుంది. ఆ దేశ రాజ్యంగంలోని 1868,14వ సవరణ చట్టం ఈ హక్కు కల్పిస్తుంది.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
అయితే ట్రంప్ ఈ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. దీంతో వలస వచ్చిన వారికి అక్కడ పిల్లలు పుడితే ఆ పిల్లలకు పౌరసత్వం రాదు. ఇలా రావాలంటే తల్లి లేదా తండ్రి శాశ్వత నివాసిగా లేదా గ్రీన్‌కార్డు హోల్టర్‌గా ఉండాలి. కానీ అమెరికాలో ఇప్పటికే లక్షలాది మంది గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తు్న్నారు. దీనివల్ల చాలామందికి పెద్దదెబ్బే పడనుంది. ప్రస్తుతం అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో మూడోవంతు అమెరికాలో పుట్టినవారు ఉండగా.. మిగిలిన వాళ్లందరూ వలసదారులే. అయితే న్యాయపరంగా సవాళ్లు పరిష్కారమైనట్లయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం 30 రోజుల్లో అమల్లోకి వస్తుంది.
Also Read : Rajasthanలో విషాదం.. అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి