US Visa Fraud : గ్రీన్‌కార్డులు పొందేందుకు చోరీ నాటకం ...వీసా మోసాలతో11 మంది ఇండియన్స్‌ అరెస్ట్‌

పలు కారణాలతో అమెరికా వెళ్లడమే కాకుండా అక్రమంగా అక్కడే ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మంది ఇండియన్లను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ దేశపు  గ్రీన్ కార్డుల కోసం వీరంతా చోరీల నాటకాలు ఆడారని దర్యాప్తులో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas

11 Indians arrested for visa fraud

US Visa Fraud :  పలు కారణాలతో అమెరికా వెళ్లడమే కాకుండా అక్రమంగా అక్కడే ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మంది ఇండియన్లను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ దేశపు  గ్రీన్ కార్డుల కోసం వీరంతా చోరీల నాటకాలు ఆడారని దర్యాప్తులో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము దోపిడీ బాధితులమని చెప్పి డ్రామాలకు తెరలేపి ‘యూ-వీసా’ పొందేందుకు ప్రయత్నించినట్లు వారిపై అభియోగాలు మోపారు. 

ఇతర దేశాల వారు ఎవరైనా అమెరికా వెళ్తే అక్కడ హింసాత్మక నేరాల్లో బాధితులై ఉంటే వారు అమెరికా (USA)లో చట్టబద్ధంగా ఉండేందుకు యూ-వీసా (నాన్‌ ఇమిగ్రేషన్‌ స్టేటస్‌)కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ  వీసా లభిస్తే వలసదారులకు పని చేసుకోవడానికి అనుమతి లభించడంతో పాటు 5-10 ఏళ్లలో గ్రీన్‌కార్డు (Green Card) పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది  భారతీయ వలసదారులు మోసాలకు పాల్పడినట్లు యూఎస్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు తేల్చారు. ఈ కేసులకు సంబంధించి మసాచుసెట్స్‌, కెంటకీ, ఒహాయో తదితర రాష్ట్రాల్లో మొత్తం 11 మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

వీరంతా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఓ వ్యక్తిని భారత్‌కు డిపోర్ట్‌ చేశారు.. మిగతావారిలో ఆరుగురిని  కోర్టులో హాజరుపర్చి విడుదల చేయగా మిగతా నలుగురిని రిమాండ్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా  ఓ ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, స్టోర్ల వద్ద దోపిడీలు చేయించినట్లు వివరించారు. అనంతరం ఈ ఘటనల్లో తాము బాధితులమంటూ నమ్మించడమే కాకుండా యూ వీసాలకు (U-Visa) దరఖాస్తులు చేసే ప్రయత్నం చేశారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ కేసులో నేర రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, 2.5లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు