అమెరికాలో అదృశ్యమైన 10 మంది 'మాస్టర్ మైండ్' శాస్త్రవేత్తలు.. వ్యూహాం వెనుక చైనా, రష్యాల హస్తం ?

అమెరికాలోని అణు, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తున్న 10 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. 2023 నుంచి ఇలా శాస్త్రవేత్తలు కనిపించకుండా పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది

New Update
10 US scientists missing since 2023 raise alarm, White House breaks silence

10 US scientists missing since 2023 raise alarm, White House breaks silence

అమెరికాలోని అణు, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తున్న 10 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. 2023 నుంచి ఇలా శాస్త్రవేత్తలు కనిపించకుండా పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగింది కాదని.. దీని వెనుక ఏదో లోతైన రహస్యం ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశ భద్రతకు వెన్నెముకగా నిలిచే అణు, అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్న సైంటిస్టులు మిస్‌ అవ్వడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది.  

దీనికి సంబంధించిన అంశంపై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్ లెవిట్‌ను విలేకర్లు ప్రశ్నించడంతో ఈ వ్యవహారం బయటపడింది. అదృశ్యమైన శాస్త్రవేత్తల వద్ద రహస్యమైన అణు సమాచారం ఉందా ? అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. దీనికి సంబంధించిన నివేదికను తాను కూడా చూశాన్నారు. కానీ దీనిపై సమాధానం ఇచ్చేందుకు త్వరలో భద్రతా సంస్థలతో మాట్లాడతానని పేర్కొన్నారు.  

Also Read: ఇరాన్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ప్లాన్ అదేనా ?

అయితే అమెరికాకు చెందిన రహస్య ఆయుధాల తయారీ,  అత్యున్నత స్థాయి రక్షణ ప్రాజెక్టుల్లో పాల్గొంటున్న శాస్త్రవేత్తలే ఇలా వరుసగా కనిపించకపోవడం వెనుక కుట్ర ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అణు రహస్యాలు తెలిసిన మేధావులకే రక్షణ లేని పరిస్థితి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం దేశ సార్వభౌమాధికారినికి ముప్పుగా పరిగణిస్తున్నారు. అందుకే ఈ కేసును సాధారణ నేర పరిశోధనగా కాకుండా.. జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించి ట్రంప్‌ యంత్రాంగం బరిలోకి దిగింది. 

చైనా, రష్యా, ఇరాన్ హస్తం ?

ప్రస్తుతం చూసుకుంటే ఈ మాస్టర్‌ మైండ్‌ శాస్త్రవేత్తల జాడ లేదా మరణాల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు FBI లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే రక్షణ రంగంలో అమెరికాకు ఉన్న పట్టును బలహీనపర్చేందుకే శత్రు దేశాలు ఇలాంటి వ్యూహానికి పాల్పడ్డట్లు మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ వ్యవహారం వెనుక చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాల హస్తం ఉండొచ్చని చెబుతున్నారు.   

అమెరికాకు ధీటుగా ఎదగాలని చైనా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. అందుకే అగ్రరాజ్యానికి చెందిన అణు, అంతరిక్ష రహస్యాలను దొంగిలించేందుకు లేదా ఆ రంగాల్లోని మేధావులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్, హైపర్ సోనిక్ క్షిపణుల తయారీలో ఉన్న శాస్త్రవేత్తలనే టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. 

Also Read: ''మీ నౌకలను ముంచేస్తాం''.. అమెరికాకు ఇరాన్‌ సంచలన వార్నింగ్‌

మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం, ఇతర అంతర్జాతీయ అంశాల్లో అమెరికా ఆంక్షల వల్ల రష్యా తీవ్రంగా నష్టపోయింది. దీంతో అమెరికాను అంతర్గతంగా దెబ్బతీసేందుకు తన గూఢచారి వ్యవస్థను ప్రయోగించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా తన అణు కార్యక్రమంపై అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల ఇరాన్ ఇబ్బందులు పడుతోంది. అందుకే అమెరికా రక్షణ రహస్యాలను సేకరించేందుకు లేదా ఆ దేశ అణు కార్యక్రమాలను అస్థిరపరచేందుకు ఇలాంటి వ్యూహాలు పన్ని ఉండొచ్చు. 

Advertisment
తాజా కథనాలు