పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ దాడి.. 90 మంది సైనికులు మృతి!

పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) మరోసారి రెచ్చిపోయింది. పాక్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌ను టార్గెట్‌ చేసి బాంబు దాడికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో 90 మంది సైనికులు మృతి చెందినట్లు బీఎల్‌ఏ తెలిపింది.

New Update
Baloch Liberation Army Attack

Baloch Liberation Army Attack

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) మరోసారి రెచ్చిపోయింది. పాక్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌ను టార్గెట్‌ చేసి బాంబు దాడికి పాల్పడింది. 90 మంది సైనికులు మృతి చెందినట్లు పేర్కొంది. కానీ ఈ దుర్ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని క్వెట్టా నుంచి టఫ్తాన్‌కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ బాంబు దాడి చేసింది.   

Also Read: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌

నొష్కి సమీపంలో ఈ దాడి జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి జరిగినట్లు పాకిస్థాన్ అధికారులు కూడా ధృవీకరించారు. ఈ దాడి తామే చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా ప్రకటించింది. ఈ దాడిలో 90 మంది పాక్ సైనికులు చనిపోయినట్లు చెప్పింది కానీ ఘటనలో 10 మంది సైనికులే ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. 

Also Read: తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు