Britan: యూకేలో డేంజర్ జోన్‌లో భారతీయులు బ్రిటన్‌లో ముగ్గురు పిల్లలను చంపారని మొదలైన గొడవలు ఇంకా ఆగడం లేదు. ఇంతకు ముందు ముస్లిమ్‌లను మాత్రమే టార్గెట్ చేసిన అల్లరి మూకలు, ఆందోళనకారులు ఇప్పుడు దక్షిణాసియా ముఖ్యంగా భారతీయుల మీద కూడా దాడులు చేస్తున్నారు. By Manogna alamuru 08 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Attacks On Indians : బ్రిటన్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపు పిలుపునివ్వడంతో అల్లర్లు నెలకొన్నాయి. హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్‌పూల్, స్టోక్ ఆన్ ట్రెంట్ తదితర ప్రాంతంలో వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల పోలీసలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. 100 మందికి పైగా నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ (EDL) అనే గ్రూపు ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం రోజుల క్రితం సౌత్‌పోర్ట్‌లో ఓ డ్యాన్స్ క్లాస్‌పై దుండగుల దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు కత్తిపోట్లకు బలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా వలసవాద వ్యతిరేక బృందాలు ఆందోళనలు చేపట్టారు. ఈగొడవల్లో భాగంగా ముస్లింలపై దాడులు జరిగాయి. ఇప్పుడు తాజాగా భారతీయల మీద కూడా అటాక్ చేస్తున్నారు. యూకేలో ఉన్న భారతీయ వలసదారుల మీద కూడా కాల్పులు చేస్తున్నారు. మిడిల్స్‌బ్రోలో, 300 మంది అల్లర్లు చాలా మంది నివాసితుల కార్లు, కిటికీలను ధ్వంసం చేశారని భారతీయ విద్యార్థి ఒకరు చెప్పారు. కార్లకు కూడా నిప్పు పెట్టారు మరియు తొమ్మిది మందిని అరెస్టు చేశారని తెలిపారు. దీంతో ఇండియన్స్, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలంటూ లండన్‌లో భారత హైకమీషన్ హెచ్చరిక జారీ చేసింది. అల్లరి మూకలు యూకేలో వలసదారుల ఆశ్రయ కేంద్రాల మీద ఎక్కువగా దాడులను చేస్తున్నారు. షాపులను లూటీ చేస్తున్నారు. దీంతో దక్షిణాసియా వలసదారుల జీవితం కష్టమయిందని మరొక భారతీయుడు చెప్పారు. ముగ్గురు బాలికలను చంపింది ముస్లిం వ్యక్తి కాదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ అల్లరి మూకలు మాత్ర వినడం లేదని అంటున్నారు. దానిని అడ్డుపెట్టుకుని తమను దేశం నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు భారతీయులు బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. Also Read: Movies: హాట్ టాపిక్‌గా సమంత రెమ్యునరేషన్ #britan #uk #indians #voilence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి