Cricket: అద్భుతంగా ఆడిన మహిళల భారత జట్టు..సీరీస్ కైవసం

దక్షిణాఫ్రికాతో ఆడుతున్న సీరీస్‌ను టీమ్ ఇండియా మహిళలు కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.

New Update
Cricket: అద్భుతంగా ఆడిన మహిళల భారత జట్టు..సీరీస్ కైవసం

India Vs south Africa: బెంగళూరులో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 50 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు మాత్రమే చేసింది. మొదట బ్యాటంఇగ్ కు దిగిన టీమ్ ఇండియా పది ఓవర్ల వరకు అసలు వికెట్ కోల్పోకుండా నెమ్మదిగా ఆడింది. 12వ ఓవర్‌లో షఫాలీ వర్మ ఆవుట్ అయింది. కానీ మొదటి డౌన్‌లో దిగిన స్మృతి మంథాన మాత్రం నిలకడగా ఆడుతూ డేలాన్ హేమలతతో కలిసి స్కోరును 100కు చేర్చింది. తర్వాత డేలాన్ వికెట్ పడినా స్మృతి మంథాన, కెప్టెన్ హర్మత్ ఫ్రీత్ కౌర్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 325 స్కోరు చేసింది.

తరువాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా మొదట్లోనే తడబడింది. మొదటి నుంచి నెమ్మదిగా ఆడింది. దానికి తోడు 15వ ఓవర్‌లో 67 పరుగుల దగ్గర మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత లారా వోల్‌వార్ట్‌తో కలిసి మారిజానే కాప్ చెలరేగడంతో నాలుగో వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈక్రమంలో మారిజానే తన సెంచరీ పూర్తి చేసింది. వోల్వార్డ్ సైతం సెంచరీ చేసింది. అయితే అంత కష్టపడి ఆడినా టీమ్ ఇండియా లక్ష్యానికి చేరుకోవాలంటే ఇంకా 11 రన్స్ చేయాల్సి ఉంది.

అది కూడా ఒక ఓవర్‌లో. పూజా వస్త్రాకర్ మొదటి 2 బంతుల్లో 5 పరుగులు ఇచ్చినా మూడో బంతికి నాడిన్ డి క్లెర్క్ (28), నాలుగో బంతికి నొందుమిసో షాంగ్సే (0)ను అవుట్ చేసింది. ఐదో బంతికి 1 రన్ వచ్చింది.. ఇక, చివరి బంతికి 5 పరుగులు అవసరం ఉన్న సమయంలో దాన్ని పూజా డాట్ బాల్ వేయడంతో దక్షిణాఫ్రికా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, వోల్వార్ట్ 135 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ తరఫున పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీశారు.

Also Read:Starlink: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌తో ఓజోన్ పొరకు ప్రమాదం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment