Crime News: ఆస్ట్రేలియాలో దారుణం.. కత్తిపోట్లకు గురై భారత విద్యార్థి మృతి

ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్‌ సంధు అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. ఇంటి అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరగగా.. వారిని ఆపేందుకు నవ్‌జీత్‌ ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు.

New Update
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

Indian Student Stabbed To Death in Australia: ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్‌ సంధు (Navjeet Sandhu) అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. భారత విద్యార్థుల మధ్యే జరిగిన గొడవల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడని మృతిడి బంధువు యష్‌వీర్ తెలిపారు. వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి మెల్‌బోర్న్‌లో ఈ ఘటన జరిగింది. తాను ఉంటున్న ఇంటి నుంచి వస్తువులు తెచ్చుకునేందుకు వెంట రావాలని నవ్‌జీత్ సంధును.. అతడి స్నేహితుడు అడిగాడు. దీంతో సంధు...తన స్నేహితుడితో కలిసి తాను ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అయితే ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత పెద్ద కేకలు వినిపించాయి. అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరుగుతోంది.

Also Read: వరదల్లో చిక్కుకున్న బ్రెజిల్.. 78 మంది మృతి

దీంతో నవ్‌జీత్‌ ఘర్షణ వద్దని వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఘర్షణలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లింది. నవ్‌జీత్‌ను తీసుకెళ్లిన అతడి స్నేహితుడికి కూడా గాయాలయ్యాయి. నవజీత్‌ సంధు స్వస్థలం హర్యానాలోని కర్వాల్ అనే ప్రాంతం. ఏడాదిన్నర క్రితం స్డటీ వీసాపై అతడు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అతడిని పొడిచిన నిందితుడిది కూడా అదే ప్రాంతమని తెలుస్తోంది. ఈ జులైలో నవ్‌జీత్ తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలో నవజీత్‌ ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా.. స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు.

Also Read: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు