Telangana : అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం..

అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

New Update
Telangana : అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం..

America : అమెరికాలో భారత సంతతి విద్యార్థులు(Indian Students) వరుసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. అయితే తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగో(Chicago) లో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. 'ఇండియాకు చెందిన రూపేశ్‌ చంద్ర చింతకింది అనే విద్యార్థి మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రూపేశ్‌ ఆచూకి తెలుస్తుందని ఆశిస్తున్నామని' షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలిపింది.

Also Read: ఈరోజు జీరో షాడో డే.. ఎప్పుడంటే

మరోవైపు పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన రూపేశ్‌ ప్రస్తుతం విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. అతడు వారం రోజులుగా కనిపించకుండా పోవండతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కొడుకు ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా(USA) ఎంబసీని కోరారు.

ఇదిలాఉండగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి అగ్రరాజ్యంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన రేపుతోంది. పలు దాడులు, కిడ్నాప్‌లు(Kidnap), రోడ్డు ప్రమాదాలు(Road Accidents) వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తమ గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని అమెరికా చెప్పింది.

Also Read: నేటి నుంచి ఇంటర్‌ ప్రవేశాలు ప్రారంభం..

Advertisment
Advertisment
తాజా కథనాలు