Stock Market Today: భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. By Manogna alamuru 20 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఈరోజు దేశీయ మార్కెట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో ఉదయం మార్కెట్ ప్రారంభం అయిన సమయానికే సూచీలు భారీ లాభాలు సూచించాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలరు విలువ 83.17 దగ్గర ఉంది. అమెరికా మార్కెట్ సూచీలు నిన్న లాభాలతో ముగిశాయి. మరోవైపు ఈరోజు ఆసియా - పసిఫిక్ మార్కెట్లు అదే బాటలో వెళుతున్నాయి. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ (Nifty) మరో చారిత్రాత్మక మైలురాయిని దాటింది. 48,000 దాటి ఇండెక్స్ దూసుకుపోతోంది. Also Read:ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్ సెన్సెక్స్ (Sensex) 30 ప్యాక్‌లో.. రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఐటీ ప్యాక్‌లో... టెక్ మహీంద్రా 2 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. విప్రో, టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) కూడా 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఆఫ్రికన్ బెవ్‌కో ఫ్రాంచైజీని కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్న వరుణ్ బెవరేజెస్ షేర్లు 10% పెరిగాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, నిప్పాన్ ఏఎంసీలో 1.79 కోట్ల షేర్లు 2.86 శాత వాటా విక్రయిస్తుందన్న వార్తలతో నిప్పాన్ AMC స్టాక్ 7% పెరిగింది.ఎంబసీ REIT నుంచి బ్లాక్‌స్టోన్ నిష్క్రమించాలని చూస్తోందని రిపోర్ట్స్ రావడంతో ఎంబసీ REIT షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. డెరివేటివ్ స్టాక్స్‌లో మరో 15% మార్జిన్ విధించడంతో BSE షేర్లు 2% పెరిగాయి. ముంబయికి చెందిన బిజినెస్ కపుల్ 19% వాటా కోసం రూ. 1,100 కోట్ల పెట్టుబడి పెడుతుందనన్న నివేదికలతో స్పైస్‌జెట్ 2% పెరిగింది. సెన్సెక్స్-30 సూచీల్లో టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, రిలయన్స్, ఇన్షోసిస్, హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా...ఎంఅండ్ఎండ, మారుతీ సన్ఫార్మా, హెచ్యూఎల్, టైటన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. #stock-market-today #shares #stock-markets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి