International : కెనడాలో భారతసంతతి కుటుంబం అనుమానాస్పద మృతి కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు. By Manogna alamuru 16 Mar 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Family Died In Canada : ఇద్దరు దంపతులు(Wife & Husband), ఒక కుమార్తె(Daughter)...అందరూ ఒకేసారి చనిపోయారు. అది కూడా ఇల్లు కాలిపోయి. ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనడా(Canada) ప్రావిన్స్‌లోని ఒంటారియోలో బ్రాంప్టన్‌లో భారత సంతతి కుటుంబం(Indian Family) నివాసముంటున్నారు. ఇందులో రాజీవ్ వరికూ(51), భార్య శిల్ప కొత్త(47) వారి కుమార్తె మహెక్ వరికూ(16) ఇక్కడే సెటిల్ అయిపోయారు చాలా ఏళ్ళుగా. అయితే వారు ఉన్నట్టుండి ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియడం లేదు. పెద్ద శబ్ధం... ఆ తరువాత మంటలు.. రాజీవ్ వరికు కుటుంబం ఉంటున్న నివాసానికి మంటలు అంటుకునే ముందు ఇంట్లో నుంచి పెద్ద శబ్దం వచ్చిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కానీ దానిని గుర్తించి వచ్చి చూసేలోపునే ఇల్లంతా మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. ఇల్లంతా మంటలు వ్యాపించడంతో ముగ్గురూ గుర్తుపట్టలేనంతగా కాలిబూడిద అయ్యారు. మార్చి ఏడవ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేమాలను పోలీసులు పరీక్షలు జరుపుతున్నారు. అనుమానం... కెనడా కుటుంబం అంతా ఒకేసారి మరణించడం పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పేలుడు రావడం, వేగంగా మంటలు వ్యాపించడం పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్(Fire Department) వారు కూడా మంటలు అంటుకోవడం మీద సందేహాలు వ్యక్తం చేశారు. మంటలు... యాక్సిడెంట్(Accident) గా అనిపించడం లేదని, ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తోందని అంటున్నారు. దీని మీద మరింత దర్యాప్తు చేస్తే గాని నిజాలు తెలియవు అంటున్నారు. Also Read : Elections: ఇవాళే ఎన్నికల షెడ్యూల్… #death #canada #family #indian-origin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి