గెలిస్తేనే నిలుస్తాం.. ఇవాళ విండీస్‌తో 'మూడో' ఫైట్! వెస్టిండీస్, ఇండియా మధ్య మూడో టీ20 ఫైట్ గయానాలో జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-0ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ కరీబియన్లదే. అందుకే టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. By Trinath 08 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India vs West Indies 3rd T20 Match: టీ20 క్రికెట్‌లో టీమిండియా(Team India) ర్యాంక్ ఏమో నంబర్ వన్.. వెస్టిండీస్(West Indies) ర్యాంక్ ఏమో 'ఏడు'. అయినా పొట్టి ఫార్మెట్‌లో విండీస్ తోపే..! టీ20 క్రికెట్‌లో తనదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలదు. రోహిత్, కోహ్లీ (Rohit & Kohli) లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియాకు కరీబియన్ జట్టు చుక్కలు చూపిస్తోంది. మొదటి రెండు టీ20ల్లో భారత్‌ను ఝలక్ ఇచ్చిన రోవ్‌మన్ పావెల్ టీమ్.. మూడో ఫైట్‌లోనూ చిత్తుచేయాలని తహతహలాడుతోంది. ఇటు టీమిండియా మాత్రం సిరీస్ గెలుపునకు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఇవాళ(ఆగస్టు 8)న జరగనున్న మూడో టీ20లో టీమిండియా ఓడిపోతే సిరీస్ సమర్పించుకున్నట్టే. ఐదు టీ20ల సిరీస్‌లో విండీస్ ఇప్పటికే 2-0 లీడ్‌లో ఉంది. ఇదేం బ్యాటింగ్: ఐపీఎల్(IPL)లో రఫ్ఫాడించిన మన యువ బ్యాటర్లు.. విండీస్ స్లో పిచ్‌లపై ఘోరంగా ఆడుతున్నారు. ఇదేం బ్యాటింగ్ బాబోయ్ అనిపించేలా ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Gill) బ్యాటింగ్ కొనసాగుతోంది. అటు వన్డేల్లో రాణించిన ఇషాన్ కిషాన్(Ishan Kishan).. పొట్టి ఫార్మెట్‌లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. మిగిలిన బ్యాటర్లది అదే తీరు. తెలుగు బిడ్డ తిలక్ వర్మ(Tilak varma) మినహా ఏ ఒక్కరూ సరిగ్గా ఆడని దుస్థితి. తిలక్ ఒక్కడే బాధ్యతగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. జట్టు మొత్తం విఫలమైన చోట తిలక్ ఆడుతున్న తీరు అద్భుతం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఎలాగైతే సేవియర్ రోల్ ప్లే చేశాడో.. ఇప్పుడు టీమిండియాలోనూ అదే పాత్ర పోషిస్తున్నాడు తిలక్. మిడిల్ ప్చ్: ఇక టాపార్డర్ మాత్రమే కాదు.. మిడిలార్డర్ ఆటతీరు కూడా అధ్వానంగానే ఉంది. సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. అటు సంజూ శాంసన్, హార్దిక్ కూడా ఏదో వచ్చామా.. నాలుగు బంతులు ఆడామా అన్నట్టు ఉంటున్నారు. మొదటి మ్యాచ్‌లో గెలిచే స్థితి నుంచి ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా రెండో టీ20లో అసలు పోరాటమే చేయనట్టు కనిపించింది. ఫ్లాట్ పిచ్‌లపై చెలరేగి ఆడే మన యువ బ్యాటర్లు.. విండీస్ గడ్డపై తడపడుతుండడం కలవరపెడుతోంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ని ఆడించే అవకాశం కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లో ముఖేశ్ లాస్ట్ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడి స్థానంలో అవేశ్‌ఖాన్, ఉమ్రాన్ మాలిక్‌లో ఎవరో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. India vs West Indies 3rd T20 Team prediction - జట్ల అంచనా భారత్: హార్దిక్‌పాండ్యా(కెప్టెన్), గిల్, ఇషాన్‌కిషన్/జైస్వాల్, సూర్యకుమార్, తిలక్‌వర్మ, శాంసన్, అక్షర్‌పటేల్, కుల్దీప్‌యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌సింగ్, ముకేశ్ కుమార్. వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, చార్లెస్, పూరన్, హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), హోల్డర్, షెఫర్డ్, హుసేన్, జోసెఫ్, మెక్‌కాయ్. Also Read: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త హెడ్ కోచ్.. ఎవరంటే..? #virat-kohli #rohit-sharma #west-indies #team-india #suryakumar-yadav #sanju-samson #tilak-varma #india-vs-west-indies #india-vs-west-indies-t20 #india-vs-west-indies-3rd-t20-match మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి