IND VS SA: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్‌-1 ప్లేయర్‌.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్‌ తుది జట్టు ఇదే!

సెంచూరియన్‌ వేదికగా రేపటి(డిసెంబర్26)నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టెస్టు ఆడనుంది. పిచ్‌ పేసర్లకు ఫేవర్‌ కావడంతో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఇండియా బరిలోకి దిగనుంది. అంటే జడేజా కోసం నంబర్‌-1 బౌలర్‌ అశ్విన్‌ మరోసారి త్యాగం చేయాల్సి ఉంటుంది.

New Update
IND VS SA: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్‌-1 ప్లేయర్‌.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్‌ తుది జట్టు ఇదే!

India Vs South Africa: అసలుసిసలైన క్రికెట్‌ సమరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. క్రికెట్‌ అంటేనే టెస్టులు.. టెస్టులు అంటేనే క్రికెట్. పరిమిత ఓవర్ల ఫార్మెట్లను ఇంతకాలం ఎంజాయ్‌ చేస్తూ వచ్చిన భారత్‌ క్రికెట్‌ అభిమానులు ఇప్పుడు టెస్టు మోడ్‌లోకి వెళ్తున్నారు. ట్రూ క్రికెట్‌ లవర్స్‌ ఎప్పుడూ టెస్టులను ఆదరిస్తారు. ఎందుకుంటే ప్లేయర్ల వ్యక్తిగత టాలెంట్‌ బయటపడే ఫార్మెట్ ఇదే. దక్షిణాఫ్రికా(South Africa) వేదికగా రెండు టెస్టుల సిరీస్‌ రేపటి నుంచి ఆరంభంకానుంది. సెంచూరియన్‌లో తొలి టెస్టు జరగనుంది. భారత్‌(India) కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30నిమిషాలకు మ్యాచ్‌ స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకుంటే రహానే, పుజారా లేకుండానే బరిలోకి దిగనున్నారు.

యువకులకు మంచి అవకాశం:
ఓపెనర్లగా రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఇది జైస్వాల్‌కు ఛాలెంజింగ్‌గా చెప్పవచ్చు. ఇక వన్‌డౌన్‌లో పుజారా లేని లోటును శుభమన్‌గిల్‌ భర్తీ చేయాలని తహాతహలాడుతున్నాడు. అయితే గత వెస్టిండీస్‌ టెస్టు టూర్‌లో గిల్‌ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కేవలం ఇండియా పిచ్‌లపైనే గిల్‌ రాణిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు చెక్‌ పెట్టాలంటే గిల్‌ కచ్చితంగా తానేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక 2 డౌన్‌లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) దిగుతాడు.. తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ వస్తాడు. ఇక ఆ తర్వాత ఆరో స్థానంలో కీపర్‌ రాహుల్‌ ఎంట్రీ ఇస్తాడు. నిజానికి గతేడాది బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రాహుల్‌ సరిగ్గా ఆడలేదు. అయినా తెలుగు కీపర్‌ భరత్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత జడేజా, ఠాకూర్‌, సిరాజ్‌, బుమ్రా బ్యాటింగ్‌కు వస్తారు. పిచ్‌ పేసర్లకు అనుకూలం కావడంతో టెస్టు నంబర్‌-1 బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్-11 : రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ఆర్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ ప్లేయింగ్-11 : డీన్ ఎల్గర్, టెంబా బావుమా (సి), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, టోనీ డి జోర్జి, కైల్ వెర్రెయిన్ (WK), కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్.

Also Read: ‘తాత్కాలిక కమిటీ ఏర్పాటు..’ క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంతో బీజేపీ ఎంపికి బిగ్ షాక్‌!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴 BRS Silver Jubilee Meeting Live Updates: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. లైవ్ అప్డేట్స్!

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హన్మకొండ జిల్లాలలోని ఎల్కతుర్తిలో జరగనుంది. ఈ సభలో కేసీఆర్ రేవంత్ సర్కార్ పై సమర శంఖం పూరించనున్నారు. సభ లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
BRS Public Meeting Warangal

BRS Public Meeting Warangal

  • Apr 27, 2025 13:48 IST

    ఉప్పల్ బాగాయత్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి



  • Apr 27, 2025 13:47 IST

    ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు



  • Apr 27, 2025 13:46 IST

    నకిరేకల్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు



  • Apr 27, 2025 13:40 IST

    కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్



  • Apr 27, 2025 13:34 IST

    ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్



  • Apr 27, 2025 13:32 IST

    మల్కాజ్ గిరి నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు



  • Apr 27, 2025 13:30 IST

    గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు



  • Apr 27, 2025 13:28 IST

    దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో..



  • Apr 27, 2025 13:26 IST

    సూర్యాపేట నుంచి భారీగా బయలుదేరిన కార్యకర్తలు



  • Apr 27, 2025 13:26 IST

    బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు

    ఖమ్మం - తిరుమలాయపాలెం వరంగల్ రోడ్డు పై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న ప్రైవేటు స్కూలు, కళాశాలల బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు

    విషయాన్ని తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఆర్టీవో, సిబ్బందిపై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి

    వాహనాలకు అనుమతించకపోతే ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించిన బీఆర్ఎస్ నేతలు

    ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు వాహనాలను అనుమతించిన అధికారులు



  • Apr 27, 2025 13:15 IST

    సిర్పూర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



  • Apr 27, 2025 13:14 IST

    జగిత్యాలలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డ్యాన్స్



  • Apr 27, 2025 12:34 IST

    బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మల్లారెడ్డి డ్యాన్స్



  • Apr 27, 2025 12:32 IST

    కోదాడ నుంచి సభకు బయలుదేరిన నేతలు



  • Apr 27, 2025 12:27 IST

    సభకు ఏర్పాట్లు పూర్తి



  • Apr 27, 2025 12:26 IST

    గన్ పార్క్ వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ నేతలు



  • Apr 27, 2025 12:26 IST

    సభకు బయలుదేరిన ఇబ్రహీంపట్నం కార్యకర్తలు



  • Apr 27, 2025 12:25 IST

    తెలంగాణ భవన్ లో రజతోత్సవ వేడుకలు



Advertisment
Advertisment
Advertisment