Ind VS SA: ఆ ముగ్గురు ఔట్.. నంబర్‌-1 ఆటగాడి స్థానంలో ఆల్‌రౌండర్‌.. తుది జట్టు ఇదే!

రేపు(జనవరి 3)దక్షిణాఫ్రికాపై భారత్‌ ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తొలి టెస్టులో ఆడిన అశ్విన్‌ స్థానంలో జడేజా, ఠాకూర్‌ స్థానంలో అవేశ్‌ఖాన్‌, ప్రసిద్‌కృష్ణ స్థానంలో ముఖేశ్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

New Update
Ind VS SA: ఆ ముగ్గురు ఔట్.. నంబర్‌-1 ఆటగాడి స్థానంలో ఆల్‌రౌండర్‌.. తుది జట్టు ఇదే!

Ind VS SA Test Series: దక్షిణాఫ్రికా(South Africa)తో ఆఖరిదైన రెండో టెస్టుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. రేపటి(జనవరి 3)నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. కేప్ టౌన్‌(Cape Town)లోని న్యూస్‌ల్యాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాపై భారత్‌ రెండో టెస్ట్ ఆడనుంది. తొలి టెస్టు ఓడిపోవడంతో సిరీస్‌ సమం చేసుకోవడానికి ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. డ్రా చేసుకున్నా సిరీస్‌ ఓడిపోయే పరిస్థితిలో టీమిండియా ఉంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది టీమిండియా. దీంతో రెండో టెస్టు కోసం పలు మార్పులు చేయనుంది.

ఆ ముగ్గురు ఔట్?
సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. టెస్టుల్లో నంబర్‌-1 బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)ని ఆడించింది. అతను పర్వాలేదనిపించాడు. అయితే రేపటి మ్యాచ్‌కు అశ్విన్‌ స్థానంలో రవీంద్ర జడేజా(Jadeja) తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అంతే కాదు ఫార్మెట్‌తో సంబంధం లేదకుండా భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పేసర్ ప్రసిద్ కృష్ణను పక్కనపెట్టే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో ముఖేశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. అటు ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ఠాకూర్‌ గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. అతని స్థానంలో అవేశ్‌ఖాన్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

భారత్ ప్రాబబుల్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్.

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ 11 : డీన్ ఎల్గర్ (సి), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కీగన్ పీటర్‌సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే (వారం), మార్కో జాన్సెన్, లుంగి ఎన్‌గిడి, కగిసో రబడ, నాండ్రే బర్గర్

Also Read: రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్స్…డిసెంబర్ 31 వరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment