PM Modi: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారందరికీ తలవంచి నా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని వ్యాఖ్యానించారు. By B Aravind 30 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విపక్షాలు బీజేపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశాయి. నాసీరకపు పనులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. విగ్రహం కూలిపోవడంపై ప్రజలకు క్షమాపణలు చెప్పారు. '' ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారందరికి తలవంచి క్షమాపణలు తెలియజేస్తున్నాను. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని'' ప్రధాని మోదీ అన్నారు. Also Read: శభాష్ అమ్మాయిలు.. పారాలింపిక్స్‌లో ఒకరికి పసిడి, మరొకరికి కాంస్యం శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా.. కొన్ని రోజుల క్రితం 35 అడుగుల ఎత్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయింది. గత ఏడాది డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్లే విగ్రహం కూలిందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు విగ్రహం ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే కూలిపోవడంతో విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ప్రచారం మీద ఉన్న దృష్టి.. నాణ్యతపై లేదంటూ సెటైర్లు వేశాయి. Also Read: సీక్రెట్ కెమెరాల కలకలం.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి #maharashtra #telugu-news #pm-modi #bjp #chatrapati-shivaji #chatrapati-shivaji-statue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి