Pakistan Elections: ఎన్నికల ఫలితాలు విడుదల.. ఇమ్రాన్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు పాకిస్థాన్‌లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రన్ పార్టీ 'పీటీఐ' బలపర్చిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలిచారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన 'పీఎంఎల్-ఎన్' పార్టీ 75 స్థానాల్లో గెలిచింది. 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' 54 సీట్లు రాగా.. మిగిలినవి ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. By B Aravind 11 Feb 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Pakistan Election Results 2024: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. తుది ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీకే-ఇ-ఇన్సాఫ్' (PTI) బలపర్చిన అభ్యర్థులే అత్యధికంగా 101 స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన 'పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ 75 స్థానాల్లో గెలిచింది. బిలావల్ జర్దరీ భుట్టోకు చెందిన 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' (PPP)కి 54 సీట్లు దక్కించుకుంది. ఇక 'ఎంక్యూఎం-పీ' పార్టీకి 17 సీట్లు రాగా.. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు గెలిచాయి Also Read: ఐపీఎల్ బ్యూటీ నవ్వింది.. సోషల్ మీడియా షేక్ అయింది! 264 స్థానాల ఫలితాలు వెల్లడి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. అయితే 266 స్థానాలకు మాత్రమే నేరుగా అక్కడ ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 70 స్థానాలను మహిళలు, మైనార్టీలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోయిన కారణంగా 265 సీట్లకు మాత్రమే గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపు తర్వాత 264 స్థానాల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్‌లో 'ఎన్ఏ-88' స్థానంలో ఫలితాలను నిలిపివేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఇక పంజాబ్, సింధ్, ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్సుల అసెంబ్లీల ఫలితాలు కూడా వచ్చేశాయి. ప్రస్తుతం బలూచిస్థాన్‌లోని మూడు నియోజకవర్గాల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 133 సీట్లు సాధించాలి. అయితే ఈ క్రమంలోనే ‘పీపీపీ’తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ‘పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీప్ (Nawaz Shareef) ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి రావాలని ‘పీటీఐ’ (Pakistan Tehreek-e-Insafa) మినహా మిగిలిన పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీలతో చర్చించే బాధ్యతను సోదరుడు షెహబాజ్ షరీఫ్‌కు అప్పగించారు. మరోవైపు.. నవాజ్‌కు అనుకూలంగా ఉన్న సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ కూడా ముందుకొచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. Also Read: వారికే రైతుబంధు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! #telugu-news #imran-khan #nawaz-sharif #pakistan-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి