Pakistan Election: పాకిస్థాన్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు.. పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో పీటీఐ పార్టీ 91 సీట్లలో గెలించింది. నవాజ్ షరీఫ్ సారథ్యంలో పీఎంఎల్-ఎన్ పార్టీ 71 స్థానాల్లో గెలిచింది. ఇక పీపీఈ 50, ఇతర పార్టీలు 20 స్థానాల్లో గెలుపొందాయి. By B Aravind 10 Feb 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉండి కూడా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి కాలేదు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు నెమ్మదిగా జరుగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థులు 92 సీట్లలో విజయం సాధించారు. ఇక నవాజ్ షరీఫ్ సారథ్యంలో పీఎంఎల్-ఎన్ 64 స్థానాల్లో గెలిచింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 50, ఇతర పార్టీలు 20 స్థానాలు సొంతం చేసుకున్నాయి. 133 సీట్లు కావాలి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికల నిర్వహిస్తారు. మిగతా 70 స్థానాలు మైనారిటీలు, మహిళలకు కేటాయిస్తారు. అయితే ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే పాకిస్థాన్‌లో అధికారం దక్కించుకోవాలంటే.. 133 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీకే ఇ- ఇన్సాఫ్(PTI)', నవాజ్ షరీఫ్ పార్టీ 'పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్' (PML-N) అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. Also Read: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు.. ఎప్పటి నుంచంటే.. సంకీర్ణ ప్రభుత్వం వైపు చూస్తున్న షరీఫ్ అత్యధిక సీట్లు ఇమ్రాన్ పార్టీకి చెందిన అభ్యర్థులకు వస్తాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరు హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే నాలుగోసారి ప్రధాని పదవిని దక్కించుకోవాలనుకుంటున్న నవాజ్ షరీఫ్.. బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పీపీపీతో (PPP) కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని వివిధ రాజకీయ పక్షాలకు నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. స్వతంత్ర అభ్యర్థులుగా దిగిన పీటీఐ అభ్యర్థులు పీటీఐ పార్టీ మాత్రం.. తాము ఎవరితోనూ జత కట్టబోమని.. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతోంది. తోషాఖానాతో పాటు పలు కేసుల్లో జైలు శిక్ష పడటంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై ఇటీవల ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు సాంకేతిక కారణాల వల్ల ఆ పార్టీ గుర్తు బ్యాట్ కూడా రద్దైపోయింది. దీనివల్ల పీటీఐ అభ్యర్థులు వివిధ గుర్తులతో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన నవాజ్ షరీఫ్.. లాహోర్‌లో గెలిచి.. మన్సెహరాలో ఓడిపోయారు. Also Read: గాయపడిన పాక్ ను బయట పడేయడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తా: నవాజ్ షరీఫ్! #telugu-news #telangana-news #imran-khan #pakistan-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి