అంబులెన్స్ లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్.. 10 మంది అరెస్ట్

రైల్వే కోడూరు బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఓ వ్యక్తి మోటర్ సైకిల్ పై అనుమాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు కొంత ముందు వెళ్లారు. అయితే ఈలోపు అక్కడికి ఓ అంబులెన్స్ వచ్చింది. ఏడుగురు వ్యక్తులు కలిసి ఎర్రచందనం దుంగలను లోపలికి ఎక్కిస్తున్నారు. ఇది చూసిన పోలీసులు వెంటనే వారిని..

author-image
By E. Chinni
New Update
అంబులెన్స్ లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్.. 10 మంది అరెస్ట్

ఎర్ర చందనం అక్రమ రవాణాకు కొత్త పుంతలు తొక్కుతున్నారు స్మగ్లర్లు. ఇప్పటికే అనేకనేక మార్గాలను ఎంచుకున్న వీరు.. ఇప్పుడు అంబులెన్స్ లను కూడా వాడేస్తున్నారు. తాజాగా అంబులెన్స్ లో అక్రమంగా ఎర్ర చందనం దుంగలను రవాణా చేస్తుండగా.. పోలీసులు చెక్ పెట్టారు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది.

రైల్వే కోడూరు బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఓ వ్యక్తి మోటర్ సైకిల్ పై అనుమాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు కొంత ముందు వెళ్లారు. అయితే ఈలోపు అక్కడికి ఓ అంబులెన్స్ వచ్చింది. ఏడుగురు వ్యక్తులు కలిసి ఎర్రచందనం దుంగలను లోపలికి ఎక్కిస్తున్నారు. ఇది చూసిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడుకు చెందిన ఏలగిరి అనే మేస్త్రీ ద్వారా కూలీలను సమకూర్చుకుని నెల్లూరు జిల్లా విజమూరుకు చెందిన రమణా రెడ్డి అనే వ్యక్తి ఎర్రచందనం దుంగలను బెంగుళూరుకు తరలిస్తున్నారు. లక్ష్మీ నరసయ్య అనే వ్యక్తి అంబులెన్స్ కు డ్రైవర్ గా, ప్రసాద్, మహేష్ అనే వ్యక్తులు రోగులు నటిస్తూ ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.

ఈ కేసులో మొత్తం 14 మంది ఉండగా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడపకు చెందిన నిమ్మల ప్రసాద్ (49), లక్ష్మీ నరసయ్య (47), పొద్దుటూరుకు చెందిన జీ సతీష్ కుమార్ (37), తమిళనాడు తిరువన్నామలైకు చెందిన మరిదిరి, గోవిందన్, కాళితో పాటు మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా మరో నలుగురు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు