Animal Actress : ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటున్న యానిమల్ భామ! యానిమల్ సెకండ్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని అనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. By Bhavana 13 Dec 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Animal Actress Tripti Dimri : యానిమల్(Animal) సినిమా విడుదలైన తరువాత అందులో నటించిన హీరోయిన్ రష్మిక (Rashmika) కంటే మరో హీరోయిన్ కి బాగా పాపులారిటీ వచ్చింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) . సినిమా చూసిన వారంతా కూడా ఆమె గురించి చెప్పుకున్నారంటే అతిశయోక్తి కాదు. తన నటన, అందంతో కట్టిపడేసింది త్రిప్తి. ఈ మూవీతో త్రిప్తి రేంజ్ పూర్తిగా మారిపోయింది. దీంతో త్రిప్తికి వరుస పెట్టుకుని ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) గురించి తన మనసులో మాట చెప్పింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ లో ఏ స్టార్ హీరోతో నటించాలని ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చెప్పింది. ఆయనతో కలిసి తెరను పంచుకోవాలనుకుంటున్నట్లు ఆమె వివరించింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యానిమల్ లో చేసిన తరువాత ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమె తెగ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందుకు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 3.6 మిలియన్లకు చేరింది. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ప్రస్తుతం దేవర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీబిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ సీఈవో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిసిన విషయం తెలిసిందే. Also read: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు! #animal #tollywood #viral #triptidimri #movies #ntr సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి