Movies: ఆ పాటను నేనేం అంత సంతోషంగా చేయలేదు-సమంత

సమంత కెరీర్‌లో నిలిచపోయే పాట ఊ అంటావా మావా...ఊహూ అంటావా మావా సాంగ్. ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ పాటను చేసినప్పుడు తాను చాలా భయపడ్డానని చెబుతోంది సమంత. తన సినిమా కెరీర్‌లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ పాటను చేయడానికి చాలా ఆలోచించానని అంటోంది.

New Update
Movies: ఆ పాటను నేనేం అంత సంతోషంగా చేయలేదు-సమంత

Samantha About Pushpa Item Song: పుష్పలో సమంత చేసిన ఐటెమ్ సాంగ్ ఊ అంటావా పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో సమంత డాన్స్‌తో ఇరగదీసింది. ఆ పాట సూపర్ హిట్ అయితే అయింది కానీ అది చేసినప్పుడు మాత్రం భయంతో వణికిపోయాను అని చెబుతోంది సమంత.

పుష్పలో హిట్ అయిన ఊ అంటావా మావా..ఊహూ అంటావా మావా...ఇప్పుడు మూడేళ్ల తర్వాత కూడా అందరి చేతా డాన్స్ చేయిస్తోంది. విదేశీయులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న ఈ పాటలో సమంత యాక్ట్ చేసింది. ఇది సమంతకు మొదటి స్పెషల్ ఐటెమ్ సాంగ్. ఐటెమ్ సాంగ్ అంటే సెక్సీగా కనిపించాలి. యాక్ట్ చేయాలి. సమంత కూడా అదే చేసింది. కానీ ఊ అంటావా పాట చేసినప్పుడు నేనేమీ సౌకర్యంగా లేను అని చెబుతోంది ఈ బ్యూటీ. సెక్సీ అనేది తన విషయం కాదని...అప్పటి వరకు అలాంటి పాటల్లో కానీ...అలాంటి సెక్సీ యాక్టింగ్‌కానీ తానెప్పుడూ చేయలేదని చెబుతోంది. అందుకే పాట మొదటి షాట్‌కు చాలాపడ్డాను అని అంటోంది. భయంతో వణికిపోయానని చెబుతోంది.

ఫ్యామిలీ మ్యాన్ సీరీస్, ఐటెమ్ సాంగ్ నాకు రెండూ ఒకలాంటివే అంటోంది సమంతా. ఇవి చేయడానికి నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు నేను ఒకటే ఆలోచించా. ఇది నా జీవితం...దాని కోసం ఏం చేసినా అందులో నుంచే నేర్చుకోవాలి అనుకున్నాను. తప్పు చేసినా సరే దాన్ని గుణపాఠంగా తీసుకోవాలని భావించాను. నేను చాలా క్ళిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ వాటిని అధిగమించి పోరాడుతున్నాను అని చెప్పుకొచ్చింది. నేను అందరిలానే కనిపించాలనుకున్నాను. అది కూడా అందంగా...అందుకే ఊ అంటావా పాటను చేశానని గర్వంగా చెబుతోంది సమంతా.

Also Read:Telangana: ప్రణీత్‌రావు కస్టడీకి అనుమతినిచ్చిన కోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు