HYDRA: బఫర్ జోన్‌లో ఓవైసీ కాలేజీలు.. కూల్చివేతకు సిద్ధమవుతున్న హైడ్రా

హైదరాబాద్‌లో సలకం అనే చెరువు బఫర్‌ జోన్‌లో ఓవైసీ కాలేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాతిమా కాలేజ్‌ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా వాటిని హైడ్రా కూల్చివేయొచ్చని సమాచారం.

New Update
HYDRA: బఫర్ జోన్‌లో ఓవైసీ కాలేజీలు.. కూల్చివేతకు సిద్ధమవుతున్న హైడ్రా

హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సలకం అనే చెరువు బఫర్‌ జోన్‌లో ఓవైసీ కాలేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాతిమా కాలేజ్‌ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తిగా చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇవి ముమ్మాటికీ ఆక్రమణలే అని హైడ్రా అధికారులు చెబుతున్నారు. సకలం చెరువు బఫర్ జోన్‌లో 12 అతిపెద్ద భవనాలు నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏ క్షణంలోనైనా ఆ భవనాలను హైడ్రా కూల్చివేయొచ్చని తెలుస్తోంది.

Also Read: తెలంగాణలో మరో డీఎస్సీ.. టెట్‌ పరీక్షకు ప్రణాళిక ఖరారు!

ఆ భవనాలను పరిశీలించి ఇప్పటికే అధికారులు నివేదిక ఇచ్చారు. గంటల వ్యవధిలోనే పని పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ఓవైసీ బ్రదర్స్, మజ్లిస్ క్యాడర్ యత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకోసం హైడ్రా అధికారులు అదనపు బలగాలను మోహరించి కూల్చివేసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే కూల్చివేతలపై బధువారం కోర్టుకు వెళ్లాలని ఓవైసీ బ్రదర్స్ యోచిస్తున్నారు. మరోవైపు ఓవైసీ బ్రదర్స్ నుంచి సకలం చెరువును కాపాడాలని ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

Also Read: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hrithik Roshan Krrish 4: ఇదో కొత్త ప్రపంచం, మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది: హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ తన డైరెక్షన్ డెబ్యూట్‌గా 'క్రిష్ 4'ను తెరకెక్కించబోతున్నారు. దర్శకుడిగా మారడం తనకు కొత్తగా, సవాళ్లతో కూడినదిగా అనిపిస్తుందని చెప్పారు. హృతిక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో అనేక మంది బాలీవుడ్ స్టార్‌లు ఉన్నారు.

New Update
Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఇప్పటివరకు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆయన ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌కి రెడీ అవుతున్నారు. అవును, హృతిక్ రోషన్ తొలిసారి దర్శకుడిగా మారనున్నట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కబోయే తొలి చిత్రం ‘క్రిష్ 4’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో హృతిక్ ఈ ప్రయాణంపై తన భావాలను షేర్ చేసుకున్నారు. “దర్శకుడిగా మారడం నాకు సంతోషకరం అయినప్పటికీ, కొంత భయం కూడా కలుగుతోంది. ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒక దర్శకుడిగా అనేక విషయాల్లో నైపుణ్యం అవసరం, భారీగా పరిశోధనలు చేయాలి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో, 'ఇది ఎందుకు ఎంచుకున్నానా?' అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయినా, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను,” అంటూ తన డైరెక్షన్ జర్నీపై హృతిక్ ఓపెన్ అయ్యారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

హృతిక్‌ త్రిపాత్రాభినయంలో..!

‘క్రిష్ 4’ అనగానే ఫ్యాన్స్‌లో ఎనలేని క్రేజ్ మొదలైంది. అందుకు కారణం, హృతిక్‌ ఇందులో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని వినిపిస్తున్న వార్తలు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ టాప్ నటీనటులు కూడా భాగం కానున్నారు. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ లాంటి ప్రముఖులు ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఈ విధంగా క్రిష్ 4 సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా హృతిక్ కొత్త ఛాప్టర్ మొదలుపెట్టబోతున్నారు. ఆయన తీసుకున్న ఈ క్రియేటివ్ రిస్క్ బాలీవుడ్‌లో మరో సెన్సేషన్‌ను సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment