హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్, విజయవాడ హైవే ఫుల్ వాహనాలతో నిండిపోయింది. హైవే విస్తరణ పనులు జరుగుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

New Update
హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్?

హైదరాబాద్- విజయవాడ హైవేలో ట్రాఫిక్ స్థంభించి పోయింది. గత కొన్ని రోజులుగా అక్కడ హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైవేను విస్తరిస్తున్నారు.దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దానికి తోడు మరో మూడు రోజుల్లో దీపావళి ఉంది. ఊర్లకు వెళ్ళేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. దీంతో హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి సుమారు 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.

Also Read:పండుగకు దేశీ ఉత్పత్తులనే వాడండి..ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు