Telangana: పారిశుద్ధ్య కార్మికురాలిపై అధికారి అఘాయిత్యం..

మేడ్చల్ జిల్లా బల్దియా పరిధిలోని గాజులరామారంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై.. మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓవ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

New Update
Telangana: పారిశుద్ధ్య కార్మికురాలిపై అధికారి అఘాయిత్యం..

GHMC Employee Kishan: మేడ్చల్ జిల్లా బల్దియా పరిధిలోని గాజులరామారంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై.. మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓవ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా రికార్డు చేసి ఆమెను వేధించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్.. తన కింద పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్లు వినాలంటూ ఆమెను బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. అధికారి వేధింపులు తట్టుకోలేక ఆమె అతని చెరలో పడక తప్పలేదు. ప్రతిరోజూ పనికి వచ్చే ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి కిషన్ లైంగికంగా వేధించేవాడు. అలాగే ఇందంతా కూడా తన ఫోన్‌లో రికార్డు చేసి.. వాటిని చూసుకుంటూ నేత్రానందం పొందేవాడు.


అయితే తాజాగా కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కార్మికురాలి ఫోన్‌లో కూడా ఈ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అందులో పనిచేసే కార్మికులు ఈ వీడియోలు ఏంటని ప్రశ్నించారు. దీంతో కిషన్‌.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ 14 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ఇచ్చాడు. ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్న కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా.. GHMC ఉన్నతాధికారులు కామాంధుడు కిషన్‌పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Also read:  ఐదేళ్లు రేవంతే సీఎం.. జగ్గారెడ్డి కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు