హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు

హైదరాబాద్‌లో రోజుకు దాదాపు పదిమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్న జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో సతమవుతున్నారు. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు ఈ వైరల్ మరింత ఎక్కువ అవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

New Update
హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు

Viral Infections In Hyderabad: హైదరాబాద్‌లో వైరల్ ఇన్ఫెక్షన్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి బారిన పడి చిన్నపిల్లలు మృత్యువాతను పడుతున్నారు. రోజుకు పది మంది చిన్నారులు చనిపోతున్నారని సమాచారం. ఇది ఒక్క నీలోఫర్ ఆసుపత్రి డేటా ప్రకారం తేలిన లెక్కలు. ఇది కాక మిగతా ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రుల క్యూ లైన్లతో నీలోఫర్ ఔట్ పేషెంట్ విభాగం నిండిపోతోంది. వైరస్ కారణంగా అధిక సంఖ్యలో చిన్నారులు జ్వరం, దగ్గు, చర్మ సమస్యల బారిన పడుతున్నారు. ఇవి తీవ్ర రూపం దాల్చడంతో మృత్యువాతన పడుతున్నారు. ఈ వైరల్ , ఇన్షెక్షన్లు ఇప్పుడే మొదలయ్యాయని..మరికొన్ని రోజుల్లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. రోజుకు దాదాపు వంద మంది దాక ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. అక్టోబర్ నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. వైరల్ జ్వరాలు, వాటి ద్వారా వచ్చే మూర్చలు మరణాలకు దారి తీస్తున్నాయని చెబుతున్నారు.

ఇన్షెక్షన్ లక్షణాలు..

నగరంలో వైరల్ ఇన్ఫెక్షన్లు చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గుతో మొదలై...విపరీతమైన జ్వరం వస్తోంది. ఇది ఎన్ని రోజులైనా తగ్గకపోవడంతో పేషెంట్లు ఆసుపత్రిలో చేరుతున్నారు. దానికి తోడు అస్సలు తినాలని లేకపోవడం, చర్మ సమస్యలు, మూర్చలు కూడా బాధిస్తున్నాయి. కొంత మందిలో కాళ్ళు, చేతులు వాచడం..చర్మంమీద దద్దుర్లు రావడం కూడా కనిపిస్తోంది.

జాగ్రత్తలు పాటించడంలేదు..

సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పరిశుభ్రత లేకపోవడం, ఇంటి దగ్గరలో నీరు నిల్వ ఉడిపోవడం, తల్లిదండ్రులు వైద్యుల సలహాలు పాటించకపోవడం వలన కూడా వైరల్ ఎక్కువై మరణాలకు దారి తీస్తోందని అంటున్నారు. మరోవైపు ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ పిల్లలకు సరైన టైమ్‌కు చికిత్స కూడా అందడం లేదని చెబుతున్నారు. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆసుప్రతులకు తీసుకువస్తున్నారు. అలా కాకుండా ఇన్షెక్షన్ మొదలైన వెంటనే చికిత్స ప్రారంభిస్తే మరణాలను ఆపవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Also Read: Andhra Pradesh: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment