హైదరాబాద్‌ను వదలని వాన.. నీట మునిగిన ఆస్పత్రి హైదరాబాద్‌ను వర్షం వదలడం లేదు. నగరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నాంపల్లిలోని పసకల ఆస్పత్రి నీటమునిగింది. దీంతో పచ్చకామెర్ల వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. By Karthik 05 Sep 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి నాంపల్లి ఓల్డ్ మలేపల్లిలో గల పసకల(పచ్చ కామెర్ల) అస్పత్రిలో నీరు చేరింది. వరద నీటితో ఆస్పత్రి ప్రాంగణం అంతా చెరువును తలపిస్తోంది. కాగా వరద గంట గంటకూ ఎక్కువ అవుతుండటంతో అక్కడ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వరదల వల్ల తాము వైద్యం చేయించుకోలేకపోతున్నామని పచ్చకామెర్ల వైద్యం కోసం వచ్చిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Your browser does not support the video tag. Your browser does not support the video tag. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పచ్చకామెర్ల వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ఇంకా వచ్చి చేరుతుందో అని వారు భయం గుప్పిట్లో బ్రతుకుతన్నారు. అధికారులు వెంటనే అస్పత్రిలో చేరిన నీటిని తొలగించాలని, వరద నీరు ఆస్పత్రిలోకి రాకుండా చూడాలని రోగులు కోరుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీర్చే విధంగా పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో డైవర్షన్‌లు ఏర్పాటు చేశారు. Your browser does not support the video tag. మరోవైపు నగరవాసులు వాహనాలకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ చేరీ చేయడంతో నగర వాసులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, తడిగా ఉన్న విద్యుత్ సంబ్తాలను తాకవని, గుంటలుగా ఉన్న రోడ్ల మధ్య తిరగవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. #hyderabad #heavy-rains #red-alert #floods #nampally #hospital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి