Prajabhavan accident case:మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్ లు

ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధాన నిందితుడు అయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌ను పక్కా పథకం ప్రకారం తప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక సీఐని, మరికొందరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు.

New Update
Ex MLA Shakeel: అలా చేస్తే నా కొడుకుని ఉరితీయండి.. మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

ఈ నెల 23 వ తేదీన హైదరాబాద్ లోని ప్రజాభవన్ దగ్గర చోటు చేసుకున్న యాక్సిడెంట్ మలుపులు తిరుగుతోంది. ఈ యాక్సిడెంట్ చేసినది మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ అయితే...అతనిని తప్పించి వేరే వాళ్ళను ఇరికించాలని చూశారు. సోహెల్ విదేశాలకు పారిపోయేట్టు చేశారు కూడా. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం అంతా తారుమారు అయ్యింది. అధికారుల వ్యాహాలన్నీ బెడిసికొట్టాయి. సోహెల్ అసలైన నిందుతుడనే విషయం బయటకు వచ్చింది. అతనిని తప్పించడానికి చూసిన అధికారుల మీద వేటు పడింది.మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్ కు పారిపోయిన షకీల్ కుమారుడు సాహిల్‌ను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సోహెల్ ను ఈ కేసులో నుంచి తప్పించడానికి పోలీసులు పక్కా ప్లాన్ చేశారనే విషయాలు తెలుస్తున్నాయి. ప్రమాదం జరిగిన రోజు రాత్రి డ్యూటీలో ఉన్న సీఐ దుర్గారావు ఘటనా స్థలం నుంచి సాహిల్‌ను కారులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్‌లో సోహెల్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించి తీసుకురావాలని అతడ్ని కానిస్టేబుల్‌కు అప్పగించారు. ఆ తరువాత అతడిని తప్పించి వేరే అతనని నిందితుడిగా చేర్చారు. బ్రీత్ ఎనలైజర్ అని బయటకు వెళ్ళిన సోహెల్ అక్కడి నుంచి తప్పించుకుని వేరే కారులో ఇంటికి వెళ్ళాడు. తన స్థానంలో డ్రైవర్ ను పంపించాడు. ఆ తరువాత సోహెల్ దుబాయ్ పారిపోయాడు. అయితే సోషల్ మీడియా పుణ్యమాని కారు యాక్సిడెంట్ వ్యవహారం మొత్తం అంతా బయటపడింది. సోహెలే నిందితుడని తెలిసింది. ఇక్కడి ట్విస్ట్ ఏంటంటే వీడియోలు క్లియర్ గా బయటకు వచ్చిన తర్వాత కూడా సీఐ దుర్గారావు సోహెలే నిందితుడనే విషయాన్ని పై అధికారుల దగ్గర దాచిపెట్టారు. ఈ గ్యాప్ లో నిందితుడు ఎంచక్కా ఉడాయించాడు.

ఈ కేసులో పూర్తి దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. ఇందులో భాగంగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారాలను కూడా సేకరించారు. ఈ కేసులో సాహిల్‌ను తప్పించేందుకు సీఐ దుర్గారావు ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసినట్టు గుర్తించినట్లు ధ్రువీకరించిన పోలీస్ ఉన్నతాధికారులు.. ఆ తర్వాతే దుర్గారావును సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇతనితో పాటూ ఇందులో ఇంకెవరెవరు ఉన్నారనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. సోహెల్ ను పట్టుకున్న తర్వాత మెడికల్ టెస్ట్ లు చేస్తే వాటి ద్వారా కూడా చాలా విషయాలు బయటపడతాయని చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

New Update
7.1 earthquake hits Tonga in South Pacific

Earthquake

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

 

 

 

Advertisment
Advertisment
Advertisment