Court: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే?

హానీమూన్‌ సమయంలో భర్త భార్యను సెకండ్‌ హ్యాండ్‌ అని పిలిచినందుకు కోర్టు భర్తకి రూ. 3 కోట్ల ఫైన్‌ వేసింది. అంతేకాకుండా నెలకు లక్షా యాభై వేల భరణాన్ని కూడా అందించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

New Update
Court: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే?

ఇద్దరు బాగా చదువుకున్నారు...మంచి ఉద్యోగాలు.. పెద్దలు వారి పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు. ఎంతో ఖర్చు పెట్టారు. ఆ తరువాత ఇద్దరు అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయారు. అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నారు. అయితే కొంతకాలానికి ఇరువురి మధ్య గొడవలు మొదలైయ్యాయి. దీంతో భార్య భర్తను విడిచిపెట్టి వచ్చి ముంబైలోని తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది.

దీంతో భర్త గారు విడాకులు కోరుతూ అమెరికా కోర్టులో అప్లై చేసుకున్నాడు. ఆ కాగితాలను భార్యకు పంపించాడు. దీంతో భార్య కూడా భర్త మీద గృహహింస కేసు పెట్టింది. ఆ పిటిషన్‌ లో ఆమె పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. తమ ఇద్దరికీ 1994లో వివాహమైందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరూ హనీమూన్ కోసం నేపాల్ వెళ్లారు. ఈ సమయంలో ఆమె భర్త ఆమెను 'సెకండ్ హ్యాండ్' అని పిలిచాడు. వాస్తవానికి, ఆమెకు ముందు ఓ నిశ్చితార్థం జరిగి ఆగిపోయింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ అమెరికా వెళ్లారని బాధితురాలు తెలిపింది. అమెరికాలో పెళ్లి వేడుక కూడా ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల తర్వాత, భర్త బాధితురాలిపై దాడి చేయడం ప్రారంభించాడు. ఆమె క్యారెక్టర్‌ పై అనుమానం వ్యక్తం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడం ప్రారంభించారు.

ఇంతలో, భార్యాభర్తలిద్దరూ 2005లో ముంబైకి తిరిగి వచ్చి ఉమ్మడిగా ఉన్న ఇంట్లో నివసించడం ప్రారంభించారు. 2008లో భార్య తన తల్లి వద్దకు వెళ్లేందుకు తల్లి ఇంటికి వెళ్లింది. భర్త మళ్లీ అమెరికాకు తిరిగి వచ్చాడు. అక్కడ నుంచి భార్యకు విడాకుల నోటీసులు పంపించాడు.దీంతో విసుగు చెందిన బాధితురాలు గృహ హింస చట్టం కింద 2017లో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. బాధితురాలు చేసిన ఆరోపణలను ఆమె తల్లి, సోదరుడు, మామ కోర్టులో ధృవీకరించారు.

బాధితురాలు గృహహింస బాధితురాలని కోర్టు అంగీకరించింది. 2023 జనవరిలో, భర్తకు రూ.3 కోట్లు పరిహారం చెల్లించాలని, దాదర్‌లో ఇల్లు ఇవ్వాలని, ప్రత్యామ్నాయంగా ఇంటికి రూ. 75 వేలు, ప్రతి నెలా రూ.1.5 లక్షల నిర్వహణ భత్యం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ భర్త హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇప్పుడు బాంబే హైకోర్టు భార్యకు రూ.3 కోట్ల పరిహారం, రూ.1.5 లక్షల భరణం ఇవ్వాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.

మహిళకు శారీరక గాయాలే కాకుండా మానసిక హింస, మానసిక వేదనకు కూడా పరిహారంగా ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also read: నువ్వో శక్తి స్వరూపిణివి.. సందేశ్‌ ఖాలీ బాధితురాలితో ఫోన్ లో మోదీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment