Israel-Hamas War: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు

ఇజ్రయెల్, హమాస్ మారణకాండలో సామాన్య పాలస్తీనియన్లు బలౌతున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా ఇరుపక్షాలు యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. శత్రువుల కోసం వేటాడుతున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎడాపెడా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడ బీభత్స వాతావరణ నెలకొంది. తాజాగా ఖాన్ యూనిస్‌లో ఓ భవనం మీద బాంబును వేయగా అందులో ఉన్న 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు.

New Update
Israel-Hamas War: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు

Israel-Hamas War: హమాస్ మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది ఇజ్రాయెల్. హమాస్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మీరు ఆపడం లేదు...మేము ఆపము అంటోంది. వీళ్ళిద్దరి గొడవ మధ్యనా అమాయక ప్రజలు బలైపోతున్నారు. వందల మంది చనిపోతున్నారు. వేల మంది గాయాలపాలవుతున్నారు. ఉత్తర గాజాతో (Gaza) పాటూ దక్షిణగాజాలో కూడా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ (Israel). నిన్న ఓ భవనం మీద చేసిన దాడిలో 15 మంది చనిపోగా, 40మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. శిథిలాల్లోంచి చిన్న పిల్లల మృతదేహాలు బయటకు తీస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

ఈ యుద్ధం ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. కానీ దీని వలన గాజాలో ఉంటున్న 23 లక్షలమంది భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఉత్తర గాజాను ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అలా అని అక్కడ ఒక్క చోటే దాడులు జరగుతున్నా అంటే దక్షిణ గాజాలో కూడా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఇప్పటికే గాజాలో 3,785 మంది మరణించారు. దాదాపు 12,500మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్లో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇవన్నీ అధికారుల చెబుతున్న లెక్కలు మాత్రమే. ఇవి కాకుండా మరణాలు, గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని అంటున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలిసే అవకాశం కూడా లేదు.

Also Read:నేడు సుప్రీం, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు నాలుగు పిటిషన్ల మీద విచారణ

ఇదిలా ఉంటే గాజాలో ఆహారం, మంచినీకుకు తీవ్ర కొరత ఏర్పడింది. ఒకపూట మాత్రమే తిండి దొరుకుతోంది. మంచి నీరు లేక మురికి నీటితో ప్జలు దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఈజిప్టు నుంచి వచ్చిన సహాయం చేరవేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది కానీ అది ఎప్పటికి ప్రజలకు చేరుతుందో చెప్పలేమని అక్కడి అధికారులు అంటున్నారు.

గాజాలో మిలిటెంట్లు ఎక్కడ ఉన్నా మట్టుబెడతామని ఇజ్రాయెల్ పదేపదే హెచ్చరిస్తోంది. సామాస్య మానవుల వేషంలో వారు తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇజ్రాయెల్ అంటోంది. తమ దగ్గర సమాచారం కూడా ఉందని చెబుతోంది. మరోవైపు హమాస్ (Hamas) ఉత్తర కొరియా ఆయుధాలను ప్రయోగిస్తోందని చెబుతున్నారు. తాము స్వాధీనంచేసుకున్న ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి వచ్చినట్లు తెలుస్తోందని సైన్యాధికారులు చెబుతున్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా (Palestine) ప్రజలు భద్రంగా, గౌరవ ప్రదంగా, శాంతియుతంగా జీవించే మార్గాన్ని అందరూ వెతకాలి అని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden). దీనికి ద్విదేశ పరిష్కారమే బెటర్ అని ఆయన అన్నారు. ఈ యుద్ధంలో తాము ఇజ్రెయెల్ వైపునే ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. ఏది ఏమైనా రెండు దేశాల ప్రతిపాదనకు అంగీకరించి ఇరు పక్షాలు యుద్ధాన్ని ముగించాలని ఆయన కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు