కాపాడలేకపోయిన రామయ్య..అయోధ్యలో బీజేపీ ఓటమి రాముని జన్మస్థానం..అంగరంగ వైబవం రాముని గుడి ప్రారంభం..హంగులూ, ఆర్భాటాలు...ఇవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. By Manogna alamuru 04 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాది చేతిలో 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయోధ్య రామమందిరం ఫైజాబాద్ జిల్లాలోకే వస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఫైజాబాద్ అనే పిలిచేవారు. 2018 తర్వాతనే అయోధ్యగా పిలుస్తున్నారు. కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచీ బీజేపీ అభ్యర్థి వెనుకంచలోనే ఉన్నారు. మరోవైపు అవధేష్ ఆధిక్యంలో కొనసాగారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఫైజాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. అప్పుడే అవధేష్ గెలుస్తారని ఆయన అన్నారు. సమాజ్ వాద్ పార్టీ ప్రస్తుతం 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పార్టీ అధినేత అఖిలేష్ 84,463 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు బీజేపీ 33 స్థానాల్లో ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పై ప్రధాని మోదీ 1, 32, 205 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. #bjp #ayodhya #elections-2024 #sp #loss మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి