Obesity : పెరుగుతున్న బరువు ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతమా? మీ జీవనశైలి ఇలా ఉంటే జాగ్రత్తగా ఉండండి! రోజులో ఎక్కువ సమయం కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. ఊబయాకం వల్ల మధుమేహం, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ ఒత్తిడికి లోనైనా, నిద్ర సరిగా పోకున్నా ఊబకాయం రావొచ్చు. ఇక లిమిట్‌కు మించి ఫుడ్ తినడం కరెక్ట్ కాదు. By Vijaya Nimma 06 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Obesity : అధిక బరువు(Over Weight) లేదా ఊబకాయం(Obesity) అనేక సమస్యలకు కారణం. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదానికి కూడా దారితీస్తుంది. అందుకే అందరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు(Health Professionals) సూచిస్తున్నారు. అధిక బరువు ఉన్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, గుండె జబ్బులు(Heart Diseases), గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక బరువు వల్ల మోకాలిపై ఎక్కువ అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ లాంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు, కౌమారదశ, పెద్దల మొత్తం సంఖ్య 100 కోట్లు దాటింది. అందరిని వేధిస్తున్న సమస్య ఇదే: పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఊబకాయం బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడానికి ప్రధాన కారణం ఎక్కువ ఆహారం తినడం, ముఖ్యంగా కేలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారిలో ఊబకాయం సమస్య ఉంటే అది వ్యాధుల సంక్లిష్టతను పెంచుతుంది. ఉదాహరణకు, మీరు ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్నట్లయితే, ఊబకాయం సమస్య గుండెపోటు లాంటి ప్రాణాంతక పరిస్థితులకు ఒక కారకం కావచ్చు.. బరువు పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం: రోజులో ఎక్కువ సమయం కూర్చోవడం(Continuous Sitting) , శారీరక శ్రమ(Physical Activity) లేకపోవడం స్థూలకాయానికి దారితీస్తుంది. అందుకే ప్రజలందరూ రోజూ వ్యాయామం చేస్తూ ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి కూడా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికితోడు ఎక్కువ ఒత్తిడికి లోనైతే, నిద్ర సరిగా పట్టకపోతే, ఈ గజిబిజి జీవనశైలి అలవాట్లు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. కుటుంబంలో ఇప్పటికే ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు బరువు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా చదవండి: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #obesity #best-health-tips #life-tips #reduce-body-fat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి