VIRAT KOHLI : కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించే వారంతా గల్లీ క్రికెటర్లే : పాక్ మాజీ క్రికెటర్

వరల్డ్ కప్ 2024 టీ 20 లో విరాట్ స్థానం పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. విరాట్ కు స్థానం కల్పిస్తారా? లేదా అని ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీ స్థానం పైనే ఉంది.

New Update
VIRAT KOHLI : కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించే వారంతా గల్లీ క్రికెటర్లే : పాక్ మాజీ క్రికెటర్

T20 World Cup 2024 : వరల్డ్ కప్ 2024 టీ 20 లో విరాట్(Virat Kohli) స్థానం పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. విరాట్ కు స్థానం కల్పిస్తారా? లేదా అని ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీ స్థానం పైనే ఉంది. జూన్ నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్(T20 World Cup) కు విండీస్(West Indies), అమెరికా(America) ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్ని లో మొదటి మ్యాచ్ జూన్ 9 న ఇండియా(India), పాకిస్థాన్(Pakistan) జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు టోర్నిలో పాల్గొనే  భారత జట్టు(Team India) ఎలా ఉంటుందని ఇంతవరకు అధికారకంగా ఎవరూ ప్రకటించలేదు. కానీ టీ20 ప్రపంచకప్ కు రోహిత్ శర్మ(Rohit Sharma) నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ  కార్యదర్శి జైషా  ఇప్పటికే వెల్లడించారు. కాని ఇప్పుడు సీనీయర్ ఆటగాడైన విరాట్ ను టోర్నిలోకి తీసుకుంటారా? లేదా యువకులకు అవకాశం కల్పిస్తారా అనే అంశం పై చర్చనడుస్తుంది.

Also Read : ఐపీఎల్ కు దూరంగా ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల పై ప్రాంఛైజీల సీరియస్!

కొందరు దేశవాళీ క్రికెటర్లు విరాట్ స్థానం కల్పించాలని చెబుతుంటే మరికొందరు విశ్లేషకులు యువకులకు అవకాశం కల్పించాలని సలహా ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఇర్ఫాన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.విరాట్ స్థానాన్ని ప్రశ్నించే వారంతే గల్లీ క్రికెటర్లే అని అన్నారు. ఇటివలే జరిగిన వన్డే ప్రపంచ కప్పులో విరాట్ టాప్ స్కోరర్ అన్నారు. ఎన్నో మ్యాచ్ లు తన ఒంటి చేత్తో గెలిపించారని గుర్తుచేశారు.అందుకే కోహ్లీని  వచ్చే టీ20 ప్రపంచకప్ లో తప్పకుండా తీసుకోవాలని..విరాట్ జట్టుతో ఉంటే మానసికంగా భారత్ విజయం సాధిస్తుందని ఇర్ఫాన్ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు