Amit Shah: ఫేక్‌ వీడియోపై స్పందించిన అమిత్‌ షా.. రిజర్వేషన్లపై ఏమన్నారంటే

కేంద్రమంత్రి అమిత్‌ షా.. రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడిన ఓ వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమిత్ షా.. తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను తొలగించదని క్లారిటీ ఇచ్చారు.

New Update
అమిత్ షా సంచలన రికార్డు

Amit Shah On Fake Video: లోక్‌సభ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఫేక్‌ వీడియోలు కూడా ఉంటున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడిన వీడియో ఒకటి వైరలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోపై తాజాగా అమిత్ షా స్పందించారు. అసహనంతోనే.. కాంగ్రెస్‌ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫేక్‌ వీడియో వెనుక రాహుల్ గాంధీ ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు.

Also Read: జేడీ(ఎస్) పార్టీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్

' బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసివేస్తామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను మా పార్టీ ఎప్పటికీ తొలగించదు. అలాగే ఇలా చేసేందుకు ఎవరినీ అనుమతించదు. ప్రధాని మోదీ రిజర్వేషన్‌కు మద్దతుదారు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని' అమిత్ షా అన్నారు. తన వీడియోతో పాటు ఇతర నేతల ఫేక్ వీడియోలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు స్థాయికి దిగజారిందని విమర్శలు చేశారు.

ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అయితే షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనిపై ఢిల్లీలో పోలీసు కేసు కూడా నమోదైంది.

Also read: బర్డ్‌ ఫ్లూ కలకలం.. కేంద్రం కీలక సూచనలు

Advertisment
Advertisment
తాజా కథనాలు