Himachal Pradesh: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్‌

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ.. కేవలం శాస్త్రీయ, ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
Himachal Pradesh: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్‌

ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూతం గంజాయి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కొందరు యువతీ, యువకులు గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోటు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతూనే ఉంటుది. హోటళ్లు, పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటూ చాలామంది దొరికిపోతుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయి సాగు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం పోలీసులు కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ కూడా వీటి వాడకం ఆగడం లేదు. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం గంజాయికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగుకూ చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

ఏంటీ గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించడం ఏంటని షాకవుతున్నారా? దీనికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. వీటి నుంచి బయటపడేందుకు ఆ రాష్ట్రం అనేక ప్రయత్నాలు చేస్తోంది.ఇందులో భాగంగానే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. మరో విషయం ఏంటంటే ఈ గంజాయిని విచ్చలవిడిగా ఉపయోగించడానికి కాదు. కేవలం రాష్ట్రంలో శాస్త్రీయ, ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అసెంబ్లీలో దీనికి సంబంధించి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి జగత్‌ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: శృంగార ఫొటోలు పంపి.. ఉచ్చులోకి లాగి: రేణుకాస్వామి హత్యలో సంచలన నిజాలు!

''గత అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్రంలో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించే ప్రతిపాదన చేశాం. ప్రభుత్వంతో పాటు విపక్షాలు దీనికి మద్ధతు తెలిపాయి. స్పీకర్‌ కూడా దీనికి సంబంధించి నా అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. గంజయి సాగుకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేనందున రాష్ట్ర ప్రజలు కూడా దీని సాగుకు మద్ధతు తెలిపారు. ఔషధ, పారిశ్రామిక అవసరాలు కోసం గంజాయిని మనం వినియోగించవచ్చు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని'' మంత్రి జగత్ సింగ్ అన్నారు.

ఇదిలాఉండగా 2023 డిసెంబర్‌లోనే ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్ సుక్కు గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించడానికి అంగీకరించారు. గంజాయి సాగు వల్ల ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేశారు. అంతేకాదు ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ డ్యాకుమెంట్స్‌ ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ఖర్చు రూ.52,965 కోట్లుగా అంచనా వేసింది. అలాగే రూ.5,479 కోట్ల అప్పుడు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చడం కోసం.. గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.

గంజాయి సాగు కోసం విత్తనాలను అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్, నిపుణులు, పలు యూనివర్సిటీలు అభివృద్ధి చేస్తాయి. మరోవైపు కమిటీ సభ్యులు కూడా ఇటీవల ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌, జమ్మూకశ్మీర్ లను సందర్శించింది. ఈ ప్రాంతాల్లో కూడా నియంత్రిత గంజాయి సాగుకు పర్మిషన్ ఉంది. అలాగే కమిటీసభ్యులు ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు పలు గ్రామాల్లో కూడా సమావేశాలు నిర్వహించారు. ఇక దేశంలో మొదటిసారిగా 2015లో ఉత్తరాఖండ్‌లో పారిశ్రామిక అవసరాల కోసం గంజయి సాగుకు చట్టబద్ధత కల్పించారు. వాస్తవానికి గంజాయి ఉత్పత్తి నుంచి పలు ఔషధాలను తయారు చేయవచ్చు. అలాగే దీని ఉత్పత్తి ద్వారా తాడు, సముద్ర నౌకల తెరచాపలు, పేపర్‌లు, బ్యాంకునోట్లు వంటి వాటిని తయారుచేయడంలో కూడా వినియోగిస్తారు.

Also Read: రీడింగ్ గ్లాసెస్‌కు బదులు ప్రెస్వూ ఐ డ్రాప్స్..నిజంగానే పని చేస్తున్నాయా?

Advertisment
Advertisment
తాజా కథనాలు