BREAKING : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా.. అసలేం జరుగుతోంది?

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం జై రామ్‌ ఠాకూర్‌ సభ వెలుపల ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
BREAKING : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా.. అసలేం జరుగుతోంది?

Sukhvinder Singh : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ(Sukhvinder Singh Sukhu) రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం జై రామ్‌ ఠాకూర్‌ సభ వెలుపల ఈ విషయాన్ని వెల్లడించారు. హిమాచల్‌లో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం సుఖు పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్(Congress) అగ్రనేతలు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి బీజేపీ(BJP) అభ్యర్థికి అనుకూలంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో కాంగ్రెస్ నాయకత్వం చర్యకు దిగింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ డేంజర్..

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆపరేషన్‌ కమల్‌ మొదలు పెట్టింది బీజేపీ. ప్రస్తుతం అక్కడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ డేంజర్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనాలని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ కు ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీకి మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకుంది. కాషాయ పార్టీలో చేరేందుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ కూడా రాజీనామా చేశారు.

అటు హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడంతో ట్రబుల్‌ షూటర్‌(Trouble Shooter) ను బరిలోకి దింపనుంది. పరిస్థితిని సమీక్షించేందుకు హుడా, శివకుమార్ సిమ్లాకు చేరుకోనున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఛాంబర్‌లో గందరగోళం సృష్టించిన బీజేపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో జై రామ్ ఠాకూర్(Jairam Tagore), విపిన్ పర్మార్, రణధీర్ శర్మ, హన్స్ రాజ్, వినోద్ కుమార్, జనక్ రాజ్, బల్బీర్ వర్మ, లోకీందర్ కుమార్, త్రిలోక్ జమ్వాల్, సురీందర్ శౌరీ, పురన్ చంద్, దలీప్ ఠాకూర్, ఇందర్ సింగ్‌బ్ గాంధీ, రణబీర్ నిక్కా, దీప్ రాజ్ ఉన్నారు.

Also Read : వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు