Movies:సలార్-2లో డార్లింగ్ ప్రభాస్ ఫ్రెండ్ యాక్ట్ చేయనున్నాడా?

డార్లింగ్ ప్రభాస్‌కు సలార్‌తో సాలిడ్ హిట్ పడింది. ఇప్పుడు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వానికి రంగం సిద్ధం అవుతోంది. సలార్-2 ఇంకా బాగుంటుందని ఇప్పటికే చెప్పాడు ప్రభాస్. ఇక ఇందులో డార్లింగ్ ప్రాణ స్నేహితుడు గోపీ చంద్ కూడా నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది.

New Update
Movies:సలార్-2లో డార్లింగ్ ప్రభాస్ ఫ్రెండ్ యాక్ట్ చేయనున్నాడా?

Salaar-2:సలార్-1 సూపర్ డూపర్ హిట్ అయింది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల‌కు బిగ్ ట్రీట్ లా నిలిచింది. సీజ్ ఫైర్ టార్గెట్ 1000 కోట్లు పెట్టుకున్నా 700 కోట్ల వ‌సూళ్ళతో స‌త్తా చాటింది. ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్ము లేపుతోంది. దీని తర్వాత సలార్-2 శౌర్యాంగ పర్వానికి రెడీ అయిపోయారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అండ్ టీమ్. స‌లార్ -2 ఇంకా బాగుంటుం ద‌ని..అస‌లైన ఆర్మీ అందులో ఉంటుంద‌ని డార్లింగ్ ప్రభాస్ హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ పతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రభాస్ ప్రాణ స్నేమితుడు కూడా జాయిన్ అవుతున్నాడన్నదే ఆ వార్త.

Also Read:Varanasi:మూడు దశాబ్దాల తర్వాత జ్ఞానవాపిలో హిందువుల పూజలు

సలార్-2 లో గోపీ చంద్...

ప్రభాస్, హీరో గోపీ చంద్ మంచి స్నేహితులు. సినిమాల్లోకి రాక ముందు నుంచే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అలాగే వీళ్ళిద్దరికీ సూపర్ మిట్ పడింది కూడా ఒక సినిమా వల్లనే. అయితే అందులో ఒక‌రు హీరో అయితే మ‌రోక‌రు విల‌న్ అయ్యారు. అదే వ‌ర్షం సినిమా. ఈ సినిమా అప్పట్లో ఎంత గొప్ప విజ‌యం సాధించిందో అందరికీ తెలిసిందే. త‌ర్వాత మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి వెండితెర మీద కనిపించబోతున్నారని వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్ అయింది.

ఇది డార్లింగ్ ఐడియానే...

సలార్-2లో గోపీ చంద్ నటిస్తున్నాడని చెబుతున్నారు. దాని కోసం కథలో అవసరమైన మార్పులుకూడా చేస్తున్నారని చెబుతున్నారు. సినిమాలో ఓ కీల‌క మైన పాత్రలో మ్యాచో స్టార్ గోపీచంద్ ని కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే ఎలాంటి పాత్ర కి తీసుకుంటున్నారు. అది ఎలా ఉండబోతోంది అన్నది మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు కూడా గోపీచంద్‌ ప్రభాస్‌కు ఆపోజిట్‌లో విలన్‌గా నటిస్తాడా లేదా సలార్‌లో ప్రబాస్ టీమ్ అయిన శౌర్యాంగుల్లో కీలక పాత్రా అన్నది క్లారిటీ లేదు గానీ గోపీచంద్ తో ఓ పాత్ర చేయించాలి అన్న ఐడియా మాత్రం డార్లింగ్ ఇచ్చిన‌ట్లే వినిపిస్తుంది.

గోపీచంద్‌కు మంచి ఛాన్స్...

ప్రభాస్ ప్రపోజల్‌కు హీరో గోపిచంద్‌ ఒప్పుకున్నాడో లేదో తెలియదు. ఒప్పుకుంటే మాత్రం ఇది గోపీచంద్‌కు నిజంగానే మంచి ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివ‌ర‌కూ గోపీచంద్ పాన్ ఇండియా సినిమా చేయ‌లేదు. రీజ‌న‌ల్ మార్కెట్ లోనూ ఆయ‌న డిమాండ్ వీక్ గానే ఉంది. ఈ నేప‌థ్యంలో సలార్ సినిమా గోపీ చంద్‌కు మంచి హెల్ప్ అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకునే ప్రభాస్‌ కూడా అతన్ని ప్రపోజ్ చేశాడేమో అని అంటోంది ఫిల్మ్ సర్కిల్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment