Diabetes
Diabetes: ఇటీవలి కాలంలో చాలా మంది బాధపడుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఒక వ్యక్తికి డయాబెటిస్ వచ్చిన తర్వాత జీవితాంతం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆహారం, పానీయాల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
జీర్ణ సమస్యలు ఉపశమనం:
తెల్ల ముస్లి అనేది ఆయుర్వేదంలో ఒక మూలికగా పరిగణించబడే అడవి మొక్క. దీనిని తరచుగా తెల్ల బంగారం లేదా దైవిక ఔషధం అని పిలుస్తారు. తెల్ల ముస్లిని శాస్త్రీయంగా క్లోరోఫైటమ్ బోరివిలియనం అని పిలుస్తారు. ఇది ఆయుర్వేదంలో శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది స్త్రీ, పురుషులలో లైంగిక శక్తిని, శారీరక బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. దీనికి గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంది. తెల్ల ముస్లీలో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు నొప్పి, విరేచనాలు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి
మహిళల్లో తల్లి పాలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది పురుషులు, స్త్రీలలో మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల ముస్లీని ఆయుర్వేదం, యునాని, హోమియోపతిలో ఉపయోగిస్తారు. దీన్ని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని చాలా మంది వైద్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ మొక్క జాతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతోంది. వైద్యులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే తెల్ల ముస్లీని తినాలి. ఈ ఔషధం కొంతమందిలో అలెర్జీలకు కారణం కావచ్చు. దాని వినియోగాన్ని ప్రారంభించే ముందు నిపుణుడిని సంప్రదించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )
Hemanth Soren: ఇక ప్రజా సేవలోనే-హేమంత్ సోరెన్
ఐదు నెలల తర్వాత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మీద విడుదల అయిన సోరెన్ ఇక మీదట ప్రజా సేవలోనే గడుపుతానని చెప్పారు. తప్పు లేకపోయినా బలవంతంగా జైల్లో పెట్టారని..తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Jarkhand: ఝార్ఖండ్ ప్రజలకు తాము ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. ఐదు నెలల తర్వాత తాను చట్టబద్ధంగా జైలు నుంచి బయటకు వచ్చానని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్నప్పుడు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం వల్ల శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.హేమంత్ జైలు నుంచి బయటకు రాగానే పెద్ద సంఖ్యలో జేఎంఎం మద్దతుదారులు అనుకూలంగా నినాదాలు చేశారు.
న్యాయవ్యవస్థతోపాటు మద్దతు తెలిపిన ప్రజలకు హేమంత్ భార్య కల్పన ధన్యవాదాలు తెలిపారు. తాను ఎందుకు జైలుకు వెళ్లానో దేశం మొత్తానికి తెలుసన్న హేమంత్, 5 నెలలుగా ఝార్ఖండ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. తన తప్పు లేకపోయినా బలవంతంగా జైల్లో పెట్టారని ఆరోపించారు.
Also Read:UGC-NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇదే..
HBD Allu Arjun: అల్లు అర్జున్ అరుదైన 8 రికార్డులు
అల్లు అర్జున్ తన కెరీర్లో ఇప్పటి వరకు అరుదైన 8 అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మూలిక వరం
రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన్నప్పుడు మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే
ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ తన కెరియర్లో సాధించిన రేర్ రికార్డులు ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఇతడే. Short News | Latest News In Telugu | సినిమా
Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..
నాగార్జున స్థానంలో బాలయ్య బిగ్ బాస్ 9 హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగ్ Short News | Latest News In Telugu | సినిమా
Bus Accident: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
Relationship Tips: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. మీ బతుకు బస్టాండే!
తమని, తమ కుటుంబాన్ని అర్థం చేసుకుని బాగా చూసుకునే అమ్మాయి తన లైఫ్‌లోకి రావాలని కోరుకుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
HBD Allu Arjun: అల్లు అర్జున్ అరుదైన 8 రికార్డులు
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మూలిక వరం
HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే
Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..
ఈ చేపలతో ఈజీగా బరువు తగ్గండిలా!