Godavari-Krishna : మహోగ్రరూపం దాల్చిన గోదావరి, కృష్ణా

భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు మహోగ్రరూపం దాల్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. రేపు అధికారులు గేట్లు ఎత్తివేయనున్నారు.

New Update
Godavari-Krishna : మహోగ్రరూపం దాల్చిన గోదావరి, కృష్ణా

Heavy Water Flooded : భారీ వర్షాల (Heavy Rains) కారణంగా గోదావరి (Godavari), కృష్ణా నదులు (Krishna River) మహోగ్రరూపం దాల్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. 15.33 లక్షల క్యూసెక్కుల నీరును అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 873 అడుగులకు నీరు చేరింది. రేపు గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Also Read: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్

వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో తాళి కట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.

New Update
aluru

aluru

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తీరు వివాదాస్పమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ  వేడుకల్లో భాగంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ క్రమంలోనే ఆలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే విరూపాక్షి సొంతూరు చిప్పగిరిలో శనివారం రాములోరి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు  ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు.

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

సాధారణంగా సీతారాముల కళ్యాణంలో భాగంగా అర్చకులు శ్రీరాములవారి తరుపున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని ఉంచుతారు. భక్తులకు మంగళసూత్రాన్ని చూపించిన తర్వాత.. ఆ రాములోరి తరుఫున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని పండితులు ఉంచుతారు. అయితే ఆలూరు ఎమ్మెల్యే మాత్రం తానే స్వయంగా సీతాదేవి మెడలో మంగళసూత్రాన్ని వేయడం వివాదాస్పదమవుతోంది.

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావటంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వారైనా ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించాల్సి ఉంది.

సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని, ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళి ఇచ్చారు. అయితే.. ఆ తాలిని కళ్ళకు అద్దుకోవాల్సింది పొగా... పొరపాటున సీతమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు ఎమ్మెల్యే విరూపాక్షి.అయితే ఈ తథంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో... ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్షి క్షమాపణలు కూడా చెప్పారు . పండితులు కట్టమంటే... తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్లు తెలిపారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు విరూపాక్షి.

Also Read:Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు!

Also Read: Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్‌...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!

ycp-mla | kurnool | ap | aluru | mla virupakshi | sri-rama-navami | latest-news | telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment