Andhra Pradesh: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దాదాపు ఏపీ అంతటా వర్షాలు పడతాయని చెప్పింది. By Manogna alamuru 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వాతావరణం New Update షేర్ చేయండి Heavy Rains: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో మరింత బలపడనుంది. ఆ తర్వాత ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రా అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. Also Read:USA: చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..కాల్పుల తర్వాత ట్రంప్‌కు భారీగా మద్దతు #andhra-pradesh #heavy-rains #weather మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి