/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-30-jpg.webp)
Desert : అరబ్ దేశాలు(Arab Countries)... నిత్యం ఎడలతో మండిపోతుంటాయి. వర్సాలు చాలా తక్కువ పడతాయి. చుట్టూ సముద్రం ఉన్న వానలు మాత్రం తక్కువే. అలాంటి దేశం ఇప్పుడు వర్షంలో మునిగిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) లో అకాల వర్షాలు(Heavy Rains) బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం స్తంభించింది. ఏడాది మొత్తంలో పడాల్సిన వర్షం ఒక్కరోజులోనే పడిపోయింది.
సోమవారం ఉదయం నుంచి కొంచెం కూడా గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇలా పడిన వర్షానికి దుబాయ్(Dubai) లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటి ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. మొత్తం నగరంలో 142 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదయింది. దాంతో పాటూ అక్కడి విమానాశ్రమం మొత్తం మునిగిపోయింది. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఒక్క సారిగా స్థంభించిపోయింది. విమానాలు రాకపోకలు నిలిచపోయాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు. రన్‌వే మీద మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోసల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Dubai Airport right now
pic.twitter.com/FX992PQvAU— Science girl (@gunsnrosesgirl3) April 16, 2024