Mumbai Rains: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన

మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.

New Update
Mumbai Rains: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన

Mumbai Rains: మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది. గుజరాత్‌ లోని సూరత్‌, వడోదరలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పుణెను భారీ వర్షాలు మంచేస్తున్నాయి.రహదారులు జలమయం అయ్యాయి. కడక్‌ వాస్లా డ్యామ్‌ కు కు వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో అధికారులు నీటిని కిందకి వదిలారు. వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

థానే, కల్యాణ్‌, పాల్ఘర్‌లో భారీ వర్షం కురుస్తుంది. కొల్లాపూర్‌ పంచగంగ నది ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తుంది. థానే, రాయ్‌గఢ్‌, పాల్ఘర్‌,పుణె, కొల్లాపూర్‌, సతారా, రాయ్‌గఢ్‌, రత్నగిరికి ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన అధికారులు. కొంకణ్‌,సెంట్రల్‌ మహారాష్ట్రకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణశాఖ అధికారులు.

Also read:రూ. 80 లక్షల విలువ చేసే వజ్రం సొంతం చేసుకున్న కార్మికుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు