AP Rain Alert: నేడు ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.

New Update
AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!

Heavy Rain Alert For AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మండుతున్న ఎండలకు చెక్‌ పెడుతూ..ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడడంతో ప్రజలు మండే ఎండలనుంచి ఉపశమనం పొందారు.

ఈ క్రమంలోనే ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

Also Read: తక్కువ నీరు తాగడం వల్ల తీవ్రమైన కిడ్నీ వ్యాధి సంభవిస్తుంది…రోజులో ఎంత నీరు తాగాలంటే!

అదే సమయంలో సత్యసాయి, విజయనగరం, ప్రకాశం, మన్యం, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. ఉరుములతో కూడి వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే వారు, రైతులు, పశువుల కాపరులు చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు తెలిపారు.

కాగా, మంగళవారం ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిశాయని వెల్లడించారు. సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5 , కోనసీమ జిల్లా మండపేటలో 120.5, రాజమండ్రిలో 92, కోనసీమ జిల్లా తాటపూడిలో 75.5, ఏలూరు జిల్లా నూజివీడులో 73.5, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు వివరించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్

గత కొన్ని రోజులుగా బెయిల్‌ కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. మిగతా కేసుల వల్ల బెయిల్ వచ్చినా రిలీజ్ కు అవకాశం లేదు.

New Update
Vallabhaneni Vamsi |

Vallabhaneni Vamsi |

Vallabhaneni Vamsi: గత కొన్ని రోజులుగా బెయిల్‌ కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు బెయిల్ మంజారు చేసింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భూకబ్జా కేసులో వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా ఆత్కూరులో వల్లభనేని వంశీమోహన్ ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసు ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

ఈ పిటిషన్ మీద ఇటీవల వాదనలు విన్న గన్నవరం కోర్టు.. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పును ఇవాళ్టికి (సోమవారం) వాయిదా వేసింది. తాజాగా తీర్పు వెల్లడించిన గన్నవరం కోర్టు వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విజయవాడ జైలులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. భూకబ్జా కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. సత్యవర్ధన్ కేసులో రిమాండ్ ఉండటంతో.. వల్లభనేని వంశీ జైళ్లోనే ఉండనున్నారు. ఈ రెండు కేసులే కాక మరికొన్ని కేసుల్లోనూ ఆయన నిందితుడిగా ఉండగా.. వీటీపై విచారణ కొనసాగుతోంది.

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు నేపాల్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆయనతో పాటుగా మరికొంతమంది నేపాల్‌లో ఉన్నట్లు సమాచారం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో పాటుగా 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో కొంతమంది ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. కొమ్మా కోటేశ్వరరావు సహా మరికొంతమంది పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే భూకబ్జా కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీ మోహన్ జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా బెయిల్‌ కోసం వంశీ సంబందీకులు ప్రయత్నం చేస్తున్నారు.

Also read :  బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

Advertisment
Advertisment
Advertisment