Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Summer Effect In Telugu States : రాత్రి లేదు పగలు లేదు ఒకటే వేడి(Heat). ఏసీల్లో కూర్చున్నంత సేపూ బాగానే ఉంటుంది. కానీ అందులో నుంచి బయటకు వచ్చామా అంతే సంగతి. ఇక ఉదయం వేళల్లో బయలకు వెళితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఎండ వేడికి, వడగాడ్పులకు మలమల మాడిపోవలసిందే. ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ(Department of Meteorology) తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల(Hail) తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ ఏడాది ఏప్రిల్లోనే గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయి ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఏళ్ల తర్వాత ఇంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. 1921 తర్వాత ఎప్పుడూ 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని తెలిపారు. రానున్న 5 రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడెక్కుతుందని, ఈ ఐదు రోజుల్లో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గతంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెబుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 47డిగ్రీలకు చేరే అవకాశం ఉందని..హైదరాబాద్‌లో 44డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. అయితే మే 6 తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని...మే ఎండ్‌కు ఋతుపవనాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెబుతోంది. Also Read:Cricket: టీ20 కు ఎంపిక అయిన భారత జట్టు కప్పు తెస్తుందా? #andhra-pradesh #telangana #summer #heat-wave మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి