Health : నిద్ర విషయంలో ఈ తప్పు చేస్తున్నారా? అయితే గుండె సమస్యలు తప్పవు!

ప్రతీరాత్రి ఒకే సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల చిరాకు, ఒత్తిడి వస్తాయి.రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి నిద్రపోక పోవడం వల్ల మెమరీ ప్రాబ్లెమ్స్‌ వస్తాయి. అంతేకాదు ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

New Update
Health : నిద్ర విషయంలో ఈ తప్పు చేస్తున్నారా? అయితే గుండె సమస్యలు తప్పవు!

Healthy Sleep : ప్రతీరాత్రి(Every Night) ఒకే సమయంలో నిద్రపోవడం అన్నిటికంటే ముఖ్యం. అయితే చాలా మంది దీన్ని పాటించరు. ఒక రోజు 10PMకి నిద్రపోతే.. తర్వాతి రోజు 12AMకి నిద్రపోతారు.. ఇంకో రోజు 1AMకి నిద్రపోతారు. ఇలా రోజుకు వివిధ టైమింగ్స్‌లో నిద్రపోవడం(Sleeping) వల్ల అనేక ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. ముఖ్యంగా జాబ్‌ చేసేవాళ్లకి రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.

Also Read : మహిళలకు విటమిన్‌ సి ఎందుకు ముఖ్యమైనదో తెలుసా.. ? ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే!

నిద్ర లేమి: ప్రతీరాత్రి వేరు వేరు సమయాల్లో నిద్రపోవడం వల్ల రెస్ట్ లేకుండా ఉన్నట్లు ఫీలింగ్‌ కలుగుతుంది. ఇది పగటిపూట అలసటకు దారితీస్తుంది.

మూడ్ డిస్టర్బెన్స్: క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల చిరాకు, ఒత్తిడి వస్తాయి. ఈజీగా విసుగు పుడుతుంది. నిరాశ కూడా కలుగుతుంది. భావోద్వేగలను కంట్రోల్‌ చేసుకోవడం కష్టం అవుతుంది.

ఆనందం ఉండదు: నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అవతలి వాళ్లు వేసే జోక్స్ బ్రెయిన్‌ వరకు వెళ్లవు. అప్పుడు నవ్వడం ఉండదు. ఇక తెలియకుండానే ఆనందాన్ని కోల్పోతారు.

ఆరోగ్య సమస్యలు: క్రమంలేని నిద్ర వల్ల ఊబకాయం(Obesity), మధుమేహం(Diabetes), గుండె సమస్యల(Heart Problems) తో సహా వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

జ్ఞాపకశక్తి: రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి నిద్రపోక పోవడం వల్ల మెమరీ ప్రాబ్లెమ్స్‌ వస్తాయి. క్రమరహిత షెడ్యూల్‌ స్లీప్ జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.

నిద్రపోవడం ఎంత ముఖ్యమో.. ప్రతీరాత్రి ఒకే సమయానికి నిద్రపోవడం(Healthy Sleep) అంతే ముఖ్యం. లేకపోతే లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లే అవుతుంది. కొంతమంది నైట్‌ షిఫ్ట్స్‌ చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఉదయం ఇంటికి వచ్చిన తర్వాత రోజూ ఒకే సమయంలో నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. అదే సమయంలో డీప్‌ స్లీప్‌ ముఖ్యం. బయట సౌండ్స్‌ లాంటివి లేకుండా ఉండేలా చూసుకోండి. ఎంతైనా నైట్‌ స్లీప్‌కి డే స్లీప్‌కి తేడా ఉంటుంది.

Also Read : రాగి పాత్రలోని నీళ్లకు.. ఇంత శక్తి ఉందా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు