Health Benefits of Corn: మొక్కజొన్నతో ఇన్ని లాభాలా.. జుట్టు కూడా పెరుగుతుందట!!

వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

New Update
Health Benefits of Corn: మొక్కజొన్నతో ఇన్ని లాభాలా.. జుట్టు కూడా పెరుగుతుందట!!

చిన్నవారి నుంచి పెద్దవారి దాకా స్ట్రీట్ ఫుడ్ అంటే నచ్చని వారుండరు. అందులోనూ వర్షాకాలంలో రోడ్ పక్కన వేడి వేడిగా తినడానికి చాలా మంది ఇష్టపడుతూంటారు. నిజాని స్ట్రీట్ ఫుడ్ తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి, ఎక్కడ ఆహారాన్ని విక్రయించినా, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. కాస్త పరిశుభ్రంగా ఆహారాన్ని అందిస్తే.. తినడంలో తప్పులేదు.

అందులోనూ ఈ వర్షాకాలంలో వీధి బండ్లపై విక్రయించే కాల్చిన మొక్కజొన్న(Corn) తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. రెయినీ సీజన్ లో కాల్చిన మొక్కజొన్న తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ తింటారు.

ఎందుకంటే కాల్చిన మొక్కజొన్న వర్షాకాలంలో(MONSOON) వివిధ రకాల వైరస్‌లు మరియు బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. వర్షపు నీరు సాధారణంగా ఆమ్లంగా ఉంటుంది. వర్షపు నీటిలో తడిస్తే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి కాల్చిన మొక్కజొన్న తింటే మేలు. ఇందులో విటమిన్ సీ ఉన్నందున చర్మ వ్యాధులను నయం చేస్తుంది.

ఇది వివిధ క్రిముల దాడి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. విటమిన్ సీతో పాటు మొక్కజొన్నలో విటమిన్ బి1, బి5 లు పుష్కలంగా లభిస్తాయి. రకరకాల వ్యాధులకు ఇది ఒక రకంగా యముడు లాంటిదని చెప్పవచ్చు.

సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో చాలా మంది యువకులు , వృద్ధులు కండ్లకలక బారిన పడతారు. మరోవైపు మొక్కజొన్నలో విటమిన్ ఏ, సీ చాలా ఉన్నాయి. కాబట్టి కంటి ఆరోగ్యం గురించి చింతించకండి.

వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు