Donald Trump : ట్రంప్‌పై కాల్పులు.. ఎలా తప్పించుకున్నారంటే ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని దుండుగులు కాల్పులు జరిపినప్పటికీ.. ట్రంప్‌ ముఖ కదలికలే ఆయన్ని ప్రాణాపాయం నుంచి రక్షించినట్లు తెలుస్తోంది.

New Update
Trump : భారీ ప్లాన్ తో వచ్చిన ట్రంప్‌ నిందితుడు... కారులో భారీగా పేలుడు పదార్థాలు!

Attack On Donald Trump : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పై కాల్పుల ఘటన దుమారం రేపుతోంది. ఆయన తృటిలో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని దుండుగులు కాల్పులు పాల్పడినప్పటికీ.. ప్రసంగంలో ట్రంప్‌ ముఖ కదలికలే ఆయన్ని ప్రాణాపాయం నుంచి రక్షించినట్లు తెలుస్తోంది. బుల్లెట్ ఆయన వైపు దూసుకొచ్చే సమయంలో ట్రంప్ తలను కొంచెం తిప్పారు. దీంతో చెవికి మాత్రమే బుల్లెట్ గాయమైంది. కొంచెం ముఖ కదలిక వేరుగా తిప్పినట్లైతే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉండేది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: భయపెడుతున్న డెంగ్యూ.. ఏడుగురు మృతి

ట్రంప్ ప్రసంగిస్తుండగా.. బుల్లెట్‌ దూసుకెళ్లిన తర్వాత వేదిక వెనుక నిలబడిన ఇద్దరు వ్యక్తిగత గన్‌మెన్‌లు రక్షించేందుకు ప్రయత్నించారు. అలాగే అక్కడున్న భద్రతా సిబ్బంది ఆయనకు అడ్డంగా నిల్చొని కిందకి వంగిపోయారు. అప్పటికే ట్రంప్‌ ముఖం రక్తంతో నిండిపోయింది. ఆ తర్వాత ట్రంప్ పిడికిలి బిగించి ఫైట్, ఫైట్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనలో సభకు వచ్చిన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడినట్లు సీక్రెట్ సర్వీస్ విభాగం తెలిపింది. అలాగే ట్రంప్‌పై కాల్పులు (Firing) జరిపిన దుండగుడిని కూడా అప్పుడే సెక్యూరిటీ సిబ్బంది హతమార్చారు.

Also Read: ట్రంప్‌పై దాడి.. అమాంతం పెరిగిన క్రేజ్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు