Harish Rao: వచ్చేది మనమే.. కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు చురకలు

ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు హరీష్ రావు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Harish Rao: వచ్చేది మనమే.. కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు చురకలు

MLA Harish Rao: భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ సమావేశానికి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఓడిపోయిన నియోజకవర్గంలో సభ లో పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నం అని అన్నారు. ఓటమి శాశ్వతం కాదు.. గెలుపుకు నాంది.. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని పేర్కొన్నారు.

ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Government) ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని అన్నారు. రైతుబంధు (Rythu Bandhu) పడడం లేదని జడ్పీ చైర్మన్‌గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారని పేర్కొన్నారు.

ALSO READ: సీఎం రేవంత్‌కు షాక్.. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని.. రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారం? అని నిలదీశారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని.. సాగునీళ్లు, తాగునీళ్లు ఉండవని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఎన్నికల్లో మన గురించి పచ్చి అబద్ధాలు చెప్పిందని.. బీఆర్ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. బండి సంజయ్, రఘనందన్ రావు, ఈటల రాజేందర్‌ల ను ఓడించింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్సే అని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గ్లెబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అపాయింట్‌మెంట్ మాత్రమే ఇచ్చిందని.. మరి ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు? అని అడిగారు. వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ 4 వేలకు పెంచలేదని... 2వేల ఫింఛన్‌ను కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆరోపించారు.

రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్.. అన్ని హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలి. కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాల్లో, తండాల్లో చర్చకు పెట్టండి అని అన్నారు. దళిత బంధుకు మంజూరైన నిధులను కాంగ్రెస్ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిందని ఫైర్ అయ్యారు.

కార్యకర్తలందరూ కష్టపడండి.. ఎంపీ సీటు మనదే అని ధీమా వ్యక్తం చేసింది. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దాం అని అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనేనని.. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని పేర్కొన్నారు. కర్నాటక కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు