Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు భద్రతా ముప్పు.. అప్రమత్తమైన గార్డ్స్ తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు పొంచి ఉన్నట్లు తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే జైల్లో ఉన్నటువంటి పలు గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఉంటున్న జైల్ నంబర్-2లో గతంలో హత్యలు జరిగాయి. By B Aravind 03 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Security Threat : ప్రస్తుతం తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారులకు అందడంతో వారు హై అలర్ట్ అయ్యారు. అదే జైల్లో ఉన్నటువంటి పలు గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశముందని అంచనా వేశారు. కేజ్రీవాల్ ఇప్పుడు జైల్ నంబర్-2లో ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు కూడా జరిగాయి. 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే ఓ నిందితుడిని గ్యాంగ్ వార్‌లో హత్య చేశారు. 2015లో ఢిల్లీలోని వసంత్ విహార్ దగ్గర జరిగిన ఓ హత్య కేసులో శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. Also Read: డిఫరెంట్‌గా నామినేషన్…రూపాయి నాణేలతో దాఖలు కేజ్రీవాల్‌కు బెదిరింపులు అయితే జైల్లో ఉండగా.. సహా ఖైదీలు అతడిని బ్యాట్లతో కొట్టి చంపేసినట్లు జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. తీహార్ జైల్లో ఖలిస్థానీలు దాడి చేస్తారని అతడు హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇటీవల విడుదల చేశాడు. దీంతో కేజ్రీవాల్ భద్రతకు ముప్పు ఉందనే అనుమానంతో అధికారులు అప్రమత్తయ్యారు. క్విక్‌రెస్పాన్స్ బృందం ఏర్పాటు ఇదిలా ఉండగా.. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ(ED) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ దాదాపు 4.5 కిలోల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.అలాగే షుగర్ లెవల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయి. ఆ తర్వాత వైద్యులు ఆయనకు చికిత్స చేసి సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఇంటి నుంచే భోజనం వెళుతోంది. ఏదైన ఎమర్జెన్సీ అయితే స్పందించేందుకు కేజ్రీవాల్ గదికి దగ్గర్లోనే క్విక్‌రెస్పాన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. Also Read: ఇజ్రాయల్ కు హర్యానా యువకులు..జీతం రూ1.37వేలు ఇక మంగళవారం తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్.. తన సతీమణి సునీత(Sunita Kejriwal) తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు తన న్యాయవాదితో కొన్ని నిమిషాలపాటు సమావేశమయ్యారు. అలాగే కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. #telugu-news #aravind-kejriwal #national-news #delhi-liquor-case #sunita-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి