Mobile Usage : మొబైల్ వాడొద్దని మందిలించిన అన్నను కడతేర్చిన చెల్లి..

మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నను చెల్లి గొడ్డలి తో నరికి చంపిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కేసీజీ జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళ్తే..

New Update
Vijayawada : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

Sister : ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నపై కోపం పెంచుకున్న ఓ 14 ఏళ్ల బాలిక అతడు నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపేసింది. కేసీజీ జిల్లా(KCG District) లో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇతర కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో అన్నాచెల్లెళ్ల(Brother & Sister) మధ్య గొడవ మొదలైంది. నిత్యం మొబైల్ ఫోన్లో(Mobile Phone) ఇతర కుర్రాళ్లతో మాట్లాడుతున్న చెల్లెల్ని అన్న మందలించాడు. సెల్‌ఫోన్ వినియోగం తగ్గించాలని కోపడ్డాడు.

దీంతో, బాలిక తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అతడు పడుకున్న సమయంలో గొడ్డలితో గొంతు నరికి చంపేసింది. ఆ తరువాత రక్తం మరకలు తొలగించుకునేందుకు స్నానం చేసి వచ్చిన ఆమె ఆ తరువాత ఇరుగుపొరుగుకు తన అన్నను ఎవరో హత్య చేశారని చెప్పింది. అయితే, పోలీసుల విచారణ సందర్భంగా బాలిక చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది.

Also Read : నాన్ రోటీలు ఇలా ట్రై చేయండి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment