Crime News: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం

హర్యానాలోని జింద్‌ జిల్లాలో ఓ బాలికను ఓ ఇంట్లో నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

New Update
Crime News: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం

Crime News: సమాజంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలు లైంగిక దాడులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ బాలికను కిడ్నాప్ చేసి.. 20 రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను రక్షించి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. హర్యానాలోని జింద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Also Read: ‘వన్‌ ఛాయ్ ప్లీస్‌’.. డాలీ చాయ్‌వాలా టీ ఆస్వాదించిన బిల్‌గేట్స్‌

అయితే 20 రోజుల క్రితం 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమెను ఓ ఇంట్లో నిర్భందించారు. 20 రోజులకు పైగా ఆమెపై అత్యాచారం చేశారు. కూతురు కనిపించకపోవడంతో.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకి తెలుసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆమె ఇంట్లో నిర్భందంలో ఉన్నట్లు గుర్తించి.. ఆమెను రక్షించారు. ఆ తర్వాత బాలిక చెప్పిన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

ఆ బాలిక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో సహా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు. అయితే ఈ విషయం బయటపడటంతో అక్కడి స్థానికులు నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read:  ఐక్యరాజ్యసమితిలో పాక్‎ను ఏకిపారేసిన భారత్..అనుపమ సింగ్ కోసం నెటిజన్లు సెర్చింగ్.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime: ఎంతకి తెగించావ్‌ రా.. తుపాకీ గురిపెట్టి దళిత మహిళపై రేప్‌

యూపీలో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మెయిన్‌పురి జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. చివరికి బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

అయితే ఆ దళిత మహిళ భర్త తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. దీన్ని ఆ నిందితుడు ఆసరాగా చేసుకున్నాడు. అతని భార్యకు రూ.20 వేలు అప్పుగా ఇస్తానని నమ్మించాడు. ఓ బ్రిడ్జి వద్ద తన కొడుకుతో ఆమె ఉంది. దీంతో మోటార్‌ బైక్‌పై ఆ నిందితుడు వచ్చాడు. వాళ్లిద్దరినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

అక్కడ ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తుపాకీతో బెదిరించి మరీ ఆమెను రేప్ చేశాడు. ఎదురు తిరిగితే తుపాకీతో కాల్చేస్తానంటూ ఇద్దరిని బెదిరించాడు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో వాళ్లు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యుల బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.    

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు

rtv-news | rape | Uttar Pradesh 

Advertisment
Advertisment
Advertisment