Pakistan: పాకిస్థాన్‌లో మోగిన ఎన్నికల నగారా.. ఎప్పుడంటే పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు జరపాలని ఇటీవల కొంతమంది సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. చివరికి ఈసీపీ ఎన్నికల తేదీని ప్రకటించింది. By B Aravind 02 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తామని పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. సకాలంలో ఎన్నికలు జరపాలని ఆ దేశంలోని సుప్రీంకోర్టులో కొంతమంది పిటీషన్లు దాఖలు చేశారు. అయితే వీటిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ తరుణంలోనో ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణ తేదీని కోర్టుకు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి నియోజవర్గాల ఏర్పాటు అంశం కొలిక్కి వస్తుందని.. ఆ తర్వాత ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం అవుతుందని ఈసీపీ తరఫు న్యాయవాది సజీల్ స్వాతి పేర్కొన్నారు. జాతీయ అసెంబ్లీ, ప్రావిన్షియల్ లెజిస్లేచర్‌ను రద్దు చేసిన 90 రోజుల్లో ఎన్నికలు జరపాలని కొంతమంది పాక్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. Also Read: ఇక చాలు ఆపండి.. ఇజ్రాయెల్-హమాస్‌కు బైడెన్ పిలుపు అయితే ఈ కేసుల విచారణనను కోర్టు ప్రారంభించడంతో.. ఎన్నికల నిర్వహణ సాగే ప్రక్రియ తీరను ఈసీ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇక నవంబర్ 30 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లో 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం రద్దైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి ఉంది. ఆ తరువాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ ఈ ఏడాది ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయడం పాక్‌లో సంచలనం సృష్టించింది. దీంతో సింధ్, బలూచిస్థాన్ అసెంబ్లీలు కూడా ముందస్తుగానే రద్దయిపోయాయి. ఇక నిబంధనల ప్రకారం 90 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. మరో విషయం ఏంటంటే అసెంబ్లీలను రద్దు చేయడానికి ముందే కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రస్ట్ (సీసీఐ) 7వ జనాభా, గృహ గణనకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో జనాభా లెక్కలు, నియోజవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఈసీపీ నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న సార్వత్రికి ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. Also read: నగ్నంగా రోడ్లపై తిరుగుతూ యువకుడు హల్ చల్.. పోలీసులపైనే ఎదురు దాడి..!(వీడియో) #telugu-news #pakistan #pakistan-news #pakistan-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి